Revanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్‌లను జన బలంతో కొట్టాలి..

ABN , First Publish Date - 2023-07-06T14:22:26+05:30 IST

హైదరాబాద్: ఎన్నికల్లో వచ్చిన మార్పులు, సాంకేతికతను బీజేపీ, బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందని.. దీన్ని కాంగ్రెస్ అధిగమించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్‌లను జన బలంతో కొట్టాలి..

హైదరాబాద్: ఎన్నికల్లో వచ్చిన మార్పులు, సాంకేతికతను బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS)లు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయని.. దీన్ని కాంగ్రెస్ (Congress) అధిగమించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ గతంలో గ్రామపెద్ద ఏ గుర్తు చెబితే ఆ గుర్తుకు గ్రామ ప్రజలు ఓటు వేసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలను దాటి.. ఏజెన్సీలు వచ్చాయని, ఏజెన్సీలను నియమించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. ఈ దేశంలో అత్యంత పేద పార్టీ కాంగ్రెస్ అని.. పార్టీ ఏ రకమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కుంటుందో అర్థం చేసుకోవాలన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్‌లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్దమయ్యాయని, బీజేపీ, బీఆర్ఎస్‌లను జన బలంతో కొట్టాలని రేవంత్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు జిల్లా కమిటీలను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. జులై 25లోగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీ తమ పార్టీకి అనుకూలంగా పనిచేయించుకుంటోందని, ఇది ఓ రకంగా అధికార దుర్వినియోగమని అన్నారు. గ్రామ స్థాయిలోనే కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక ఓట్లను గుర్తించాలన్నారు. ఆగస్టు 18న హైదరాబాద్ మండల అధ్యక్షులకు ట్రైనింగ్ కార్యక్రమం ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-07-06T14:22:26+05:30 IST