Revanth Reddy: తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి..
ABN , First Publish Date - 2023-06-21T17:04:00+05:30 IST
హైదరాబాద్: జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలకు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, వెంట కోమటిరెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డి తదితరులు వెళ్లారు. ముందు జూపల్లితో చర్చలు జరిపారు. తర్వాత పొంగులేటి నివాసంలో రెండు గంటల పాటు చర్చలు జరిపారు.
హైదరాబాద్: జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) నివాసాలకు కాంగ్రెస్ నేతలు (Congress Leaders) రేవంత్ రెడ్డి (Revanthreddy), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy), మల్లు రవి (Mallu Ravi), చిన్నారెడ్డి (Chinnareddy) తదితరులు వెళ్లారు. ముందు జూపల్లితో చర్చలు జరిపారు. తర్వాత పొంగులేటి నివాసంలో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ (AICC) ఆదేశాల మేరకు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిశామన్నారు. ఆ ఇద్దరు నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించామని, తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. ఇక మంచి ముహూర్తంలో చేరికలు ఉంటాయన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబం (KCR Family) మాత్రమే బాగుపడిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నామని చెప్పారు. యూఏపీఏ (UAPA) చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. విమలక్కపై పెట్టిన యూఏపీఏ కేసును తొలగించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ పేరుతో దోపిడీ చేస్తున్నారని, కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయమైందని, రాష్ట్రంలో వరికి సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రేవంత్ విమర్శించారు.
అంతకుముందు జూపల్లి కృష్ణారావు ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయనను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. అందుకు జూపల్లి సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని ఇంకా అనేకమైన చేరికలు ఉంటాయని రేవంత్ చెప్పారు. కాగా రేపు పొంగులేటి, జూపల్లితో కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రాహుల్ సమక్షంలో ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు.