Revanth Reddy: ఐదు ప్రధాన అంశాలతో ప్రజల దగ్గరికి వెళ్తాం..
ABN , First Publish Date - 2023-06-09T15:57:55+05:30 IST
హైదరాబాద్: అభయ హస్తం పేరుతో ఐదు ప్రధాన అంశాలతో ప్రజల దగ్గరికి వెళ్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కత్రియ హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్: అభయ హస్తం (Abhaya Hastam) పేరుతో ఐదు ప్రధాన అంశాలతో ప్రజల దగ్గరికి వెళ్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కత్రియ హోటల్ (Katriya Hotel) వద్ద మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదల (Manifesto Release) చేస్తామని స్పష్టం చేశారు. పలు పార్టీల నేతలతో అధిష్టానం చర్చలు జరిపిందని, ప్రజలు కోరుకుంటున్న విధంగానే చేరికలు ఉంటాయని, కర్ణాటక (Karnataka ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయన్నారు. సీఎం కేసీఆర్‌కు తన పేరు తీసే దైర్యం ఉందా? అని ప్రశ్నించారు. దమ్మంటే తన పేరు తీయాలని ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నానన్నారు.
తన భూమి వివరాల కోసం చాలా రోజుల నుంచి రంగారెడ్డి కలెక్టర్ దగ్గరకి తిరుగుతున్నానని రేవంత్ అన్నారు. గడీల పాలన పునరుద్ధరించడానికి సీఎం కేసీఆర్ (CM KCR) ధరణి పోర్టల్ తెచ్చుకున్నారని విమర్శించారు. భూస్వాములను తరిమి కొట్టడానికే నక్షల్బరీ ఉద్యమం వచ్చిందని, ధరణిలో పోర్టల్ ప్రభుత్వం చేతిలో లేదని, దళారుల చేతిలోకి పోయిందని అన్నారు. ధరణి లేకపోతే రైతుబందు రాదనడం బర్రతక్కువ పని అని మండిపడ్డారు. ధరణి మోసాల వల్ల కేసీఆర్ కుటుంబం చర్లపల్లి జైలుకి వెళ్తుందన్నారు. చర్లపల్లి జైలులో కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామన్నారు.
బావ బామ్మర్థులు (కేటీఆర్, హరీష్ రావు) వస్తే బహిరంగంగా చర్చిద్దామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలోనైనా చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. రెండు వేల రూపాయలకు రెండు ఫుట్ బాటిల్స్ కూడా రావడం లేదన్నారు. తండ్రి కొడుకులు నిప్పుతొక్కిన కోతుల్లా ఎగురుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబంలా ప్రజలను దోచుకోమని స్పష్టం చేశారు. సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపంపై ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష వేయిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.