Home » Rishabh Pant
చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ముందుగా ఫీల్డింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో మ్యాచ్‌లో అతిథ్య పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ 17లో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్(punjab kings), ఢిల్లీ క్యాపిటల్స్(delhi capitals) జట్ల మధ్య ఛండీగఢ్(chandigarh) ముల్లన్పూర్(Mullanpur)లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్లలో ఏ మ్యాచ్ గెలుస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా అయిన గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ మళ్లీ బ్యాటు పట్టుకుని మైదానంలోకి దిగాడు. ఐపీఎల్లో ఆడడానికి పంత్‌కు బీసీసీఐ నుంచి కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకొన్న రిషభ్ పంత్.. 14 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈనెల 22 నుంచి జరిగే ఐపీఎల్లో ఆడేలా పంత్‌కు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పంత్ తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి విశాఖపట్నం స్టేడియంలో సన్నాహకాలు మొదలుపెట్టాడు.
ఐపీఎల్ 2024 (IPL2024) ఆరంభానికి ముందు డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్-వికెట్‌కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ వచ్చింది. రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ‘‘ డిసెంబర్ 30, 2022న ఉత్తరఖండ్‌లోని రూర్కీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన దాదాపు 14 నెలల సుధీర్ఘ పునరావాసం, రికవరీ ప్రక్రియ తర్వాత రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నాడని ప్రకటిస్తున్నాం. రాబోయే ఐపీఎల్ 2024కు ముందు వికెట్ కీపర్ - బ్యాటర్‌గా ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారిస్తున్నాం’’ అని ఎక్స్ వేదికగా బీసీసీఐ వెల్లడించింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. అంకిత్ చౌదరి అనే వ్యక్తితో ఇటీవల ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులతోపాటు స్నేహితులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.
తానొక స్టార్ క్రికెటర్ని అని, ఐపీఎస్ ఆఫీసర్ని అని చెప్పి లగ్జరీ హోటళ్లను మోసం చేసిన మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెజ్‌తో సహా పలు హోటళ్లలో మృణాంక్ సింగ్ రూ.5.5 లక్షల మోసం చేశాడు.
KL Rahul: మిగతా భారత బ్యాటర్లు విఫలమైన చోట టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చి రాహుల్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు.
Viral Video: ఐపీఎల్ వేలం ముగిసిన అనంతరం రిషబ్ పంత్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఓ మ్యాచ్‌లో తలపడ్డారు. వీళ్లిద్దరూ సరదాగా టెన్నిస్ ఆడారు. నీటిపై ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టులో డబుల్స్ ఆడారు. ధోనీ, పంత్ ప్రత్యర్థుల్లా ఈ మ్యాచ్‌లో తలపడ్డారు.