Share News

DC vs CSK: టాస్ గెలిచిన ఢిల్లీ.. తుది జట్లు ఇవే!

ABN , Publish Date - Mar 31 , 2024 | 07:27 PM

చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ముందుగా ఫీల్డింగ్ చేయనుంది.

DC vs CSK: టాస్ గెలిచిన ఢిల్లీ.. తుది జట్లు ఇవే!

విశాఖ: చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (Delhi Capitals vs Chennai Super Kings) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ముందుగా ఫీల్డింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్, రికీ భూయ్ స్థానంలో జట్టులోకి పృథ్వీషా, ఇషాంత్ శర్మను తీసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడడం లేదని టాస్ సమయంలో కెప్టెన్ రిషబ్ పంత్ చెప్పాడు. ఇక చెన్నైసూపర్ కింగ్స్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఐపీఎల్ చరిత్రలో చెన్నైసూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 29 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా చెన్నై 19 మ్యాచ్‌ల్లో గెలవగా.. ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో గెలిచిన చెన్నైసూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో ఇంకా బోణీ చేయలేదు. ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలాగైన ఐపీఎల్ 2024లో బోణీ చేయాలని ఢిల్లీ భావిస్తోంది.


తుది జట్లు

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్ట్జే, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా, ముస్తాఫిజుర్ రెహమాన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 31 , 2024 | 07:35 PM