Share News

IPL 2024: నేడు మధ్యాహ్నం PBKS vs DC మ్యాచ్.. మరి ఎవరు గెలుస్తారు?

ABN , Publish Date - Mar 23 , 2024 | 08:51 AM

ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ 17లో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్(punjab kings), ఢిల్లీ క్యాపిటల్స్(delhi capitals) జట్ల మధ్య ఛండీగఢ్‌(chandigarh) ముల్లన్‌పూర్‌(Mullanpur)లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్లలో ఏ మ్యాచ్ గెలుస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.

IPL 2024: నేడు మధ్యాహ్నం PBKS vs DC మ్యాచ్.. మరి ఎవరు గెలుస్తారు?

ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ 17లో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్(punjab kings), ఢిల్లీ క్యాపిటల్స్(delhi capitals) జట్ల మధ్య ఛండీగఢ్‌(chandigarh) ముల్లన్‌పూర్‌(Mullanpur)లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే దాదాపు 15 నెలల తర్వాత రిషబ్ పంత్(rishabh pant) ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అయిన పంత్ డిసెంబర్ 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత మొదటిసారి ప్రొఫెషనల్ మ్యాచ్‌లో కనిపించబోతున్నాడు.

శనివారం జరిగే మ్యాచ్ ఆడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నానని పంత్ ఇప్పటికే తెలిపాడు. గత సీజన్‌లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఢిల్లీ తొమ్మిదో స్థానంలో నిలవగా, పంజాబ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత ఐపీఎల్‌(ipl)తో పోలిస్తే ఈసారి ఎక్కువసేపు బ్యాటింగ్ చేసి సన్నద్ధమయ్యానని ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ పంత్ గురించి చెప్పాడు. ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్ రెండూ పటిష్టంగా ఉన్నాయి.


మరోవైపు ఢిల్లీ జట్టుకు దూరమైన తర్వాత, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్(shikhar dhawan) కచ్చితంగా ఈసారి తన జట్టును గెలిపించుకోవాలని చూస్తున్నారు. 2014లో ఈ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ చివరకు KKR చేతిలో ఓడిపోయింది. జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా జితేష్ శర్మ కొత్త వైస్ కెప్టెన్ రానున్నారు. సికందర్ రజా, సామ్ కుర్రాన్, లియామా లివింగ్‌స్టోన్ రూపంలో జట్టులో మంచి ఆల్ రౌండర్లు ఉన్నప్పటికీ. రబడ, అర్ష్‌దీప్, హర్షల్ పటేల్ రూపంలో వారి బౌలింగ్ కూడా పర్వాలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలో శనివారం మైదానంలోకి దిగిన ఇరు జట్లు గత సీజన్‌లో పేలవ ప్రదర్శనను మరిచిపోవాలనుకుంటున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్(delhi capitals) జట్టులో: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (captain ,wicket keeper), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్/ట్రిస్టాన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్/కుమార్ కుశాగ్రా, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఖల్లిల్ శర్మ, ఇషాంత్ శర్మ అహ్మద్ కలరు.

పంజాబ్ కింగ్స్(punjab kings) జట్టులో: శిఖర్ ధావన్ (captain), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (wicket keeper), అశుతోష్ శర్మ/శశాంక్ సింగ్, సామ్ కర్రాన్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: CSK vs RCB: అందుకే ఓడిపోయామని చెప్పిన ఆర్సీబీ కెప్టెన్.. లేదంటే

Updated Date - Mar 23 , 2024 | 08:53 AM