Home » Road Accident
సంగారెడ్డి జిల్లా: ఆర్సీపురం రైల్వే ట్రాక్ సమీపంలో అర్ధరాత్రి ఫుట్ పాత్ పైకి ప్రైవేట్ ట్రావెల్ బస్సు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు పరుగులు తీసి తప్పించుకున్నారు.
Telangana: కోకాపేటలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద బైక్‌ను ఓ ఆటో ఢీకొట్టి.. ఆపై ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బిస్వాల్ ప్రభాస్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే తమ బిడ్డ ప్రాణాలతో లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ప్రముఖ సింగర్ మంగ్లీకి ప్రమాదం తృటిలో తప్పింది. కారులో ప్రయాణిస్తున్న మంగ్లీ కారును డీసీఎం వాహనం ఢీ కొట్టింది. శంషాబాద్ తొండుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. నందిగామ కన్హ శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరైంది.
యువతులు తమ స్కూటీతో ఏకంగా ఇంటి టాపులోకి దూసుకుపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
గుంటూరు జిల్లా: మంగళగిరి మండలం ఆత్మకూరు బైపాస్ రోడ్డు వద్ద గత అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. మిర్చి బస్తాల లోడుతో వస్తున్న ఆటో.. రోడ్డు పక్కనే ఉన్న వారిపైకి దూసుకెళ్లి.. పక్కనే ఉన్న నేల బావిలో ఆటో పడిపోయింది.
విశాఖ జిల్లా: పెందుర్తి నేషనల్ హైవే వద్ద మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుణుపూర్ నుంచి హైదరాబాద్‌కు ఐరన్ స్క్రాప్ లోడుతో వస్తున్న లారీ పెందుర్తి జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఎన్ శేఖర్ రెడ్డి (55) అక్కడికక్కడే మృతి చెందాడు.
కారు మోడ్‌ను పొరపాటున మార్చడంతో అమెరికాలో ఓ సంపన్న కుటుంబానికి చెందిన మహిళ, ప్రముఖ కంపెనీ సీఈవో మృతి చెందారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Andhrapradesh: అరకులోయలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. గత రాత్రి అరకులోయ మండలంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింహాద్రి (28)ని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరకులోయ మండలం గన్నెల రహదారిలో మాదల పంచాయతీ నంది వలస గ్రామం వద్ద రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు సహా నలుగురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. చిలుకూరు నుంచి రాజేంద్రనగర్ వెళ్తున్న సర్వీస్ రోడ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్.. వేగంగా ముందు వెళ్తున్న కారుని ఢీకొట్టింది.