Road Accidents: ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఢీ.. బాబోయ్.. పరిస్థితి ఎలా ఉందంటే..
ABN , Publish Date - Apr 14 , 2025 | 08:03 PM
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. రాపూరు తిక్కనవాటిక పార్క్ సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న సురేశ్, అతని అత్త సరస్వతి అక్కడికక్కడే మరణించారు.

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఘోర రోడ్డుప్రమాదాలు సంభవించాయి. ఉమ్మడి నెల్లూరు, కడప జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఢీకొని ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మరోవైపు ఇదే ప్రమాదంలో వెనక వైపు నుంచి వస్తున్న హైవే పెట్రోల్ పోలీస్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులంతా నంద్యాల జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. రాపూరు తిక్కనవాటిక పార్క్ సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న సురేశ్(26), అతని అత్త సరస్వతి(45) అక్కడికక్కడే మరణించారు. మద్యం మత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులు పూటుగా మద్యం సేవించి కారు నడిపి వారి మృతికి కారణం అయ్యారని తెలిపారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు పొదలకూరులో ఒకరు, తడ సమీపంలో మరొకరు రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు.
మంత్రి దిగ్భ్రాంతి..
కాగా, కడప జిల్లా నడింపల్లి ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందటం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ఘటనా స్థలంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Cabinet Meet: మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ.. ఈసారి చర్చించే అంశాలివే..
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..