Share News

Road Accident: రోడ్డు ప్రమాదం..డిప్యూటీ కలెక్టర్ మృతి

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:27 PM

అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కలెక్టర్ రమాదేవిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 Road Accident: రోడ్డు ప్రమాదం..డిప్యూటీ కలెక్టర్ మృతి
Road Accident in Annamayya District

అన్నమయ్య : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రాయచోటి (Rayachoti), చిత్తూరు రహదారి సంబేపల్లె మండలం, ఎర్రగుంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. (Two cars collided). ఈ ప్రమాదంలో హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి (HNNS Deputy Collector Ramadevi) మృతి (Death) చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రమాదేవి వాహనం పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రమాదేవి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

Also Read..: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం..


ఈ ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ రమాదేవి ప్రయాణిస్తున్న కారు నుజ్జు నుజ్జు కావడంతో ఆమె కారులో ఇరుక్కున్నారు. అక్కడున్న స్థానికులు పరుపరుగున వచ్చి రమాదేవిని వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా రమాదేవి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. క్షతగాత్రులు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు రమాదేవి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబుతో చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నా..: లోకేష్

శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..

నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు బంద్

For More AP News and Telugu News

Updated Date - Apr 07 , 2025 | 01:14 PM