Share News

Road Accident: ఘోర ప్రమాదం.. అడిషినల్ ఏఎస్పీ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

ABN , Publish Date - Mar 22 , 2025 | 07:40 AM

హైదరాబాద్ హయత్ నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మార్నింగ్ వాక్ చేస్తున్న ఏఎస్పీని ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఢీకొట్టింది.

Road Accident: ఘోర ప్రమాదం.. అడిషినల్ ఏఎస్పీ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
Road Accident

హైదరాబాద్: హయత్ నగర్ లక్ష్మారెడ్డిపాలెం (Laxmareddipalem) వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) సంభవించింది. రోడ్డుప్రమాదంలో అడిషినల్ ఎస్పీ టీఎం నందీశ్వర బాబ్జి (Additional SP TM Nandeeshwara Babji) ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ (శనివారం) ఉదయం వాకింగ్ కోసమని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదాని వైపునకు ఏఎస్పీ బాబ్జి వెళ్లారు.


ఈ క్రమంలో జాతీయ రహదారిని దాటేందుకు ఏఎస్పీ బాబ్జి యత్నించారు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు అతన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబ్జి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రస్తుతం ఆయన రాచకొండ కమిషనరేట్‌ కంట్రోల్‌ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మూడ్రోజుల క్రితమే ఏఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. మరోవైపు బాబ్జి మృతి పోలీసు శాఖను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Harish Rao: తెలంగాణ.. తిరోగమనం!

Gold and Sliver Prices: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఇక బంగారం కొనగలమా..

Updated Date - Mar 22 , 2025 | 08:12 AM