Home » RS Praveen Kumar
రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని, నాలుగు కోట్ల మంది గుండెలను గాయపరచడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy) హత్య కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ ఆరోపించారు.
బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు దారితీసిన కారణాల మీద విచారణ జరుగుతుందని.. బాధ్యుల మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి (Mallu Ravi) తెలిపారు.
తాను ప్రవేశపెట్టిన స్వేరో అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరిందని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసులు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కావాలో.. విద్యార్థుల సమస్యలపై పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలో మీరే ఆలోచించాలని కోరారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ఛాలా ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన తీహార్ జైల్లో కవితను ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని ఆరోపించారు.
Telangana Lok Sabha Polls: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా గులాబీ జెండా పాతాల్సిందేనని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహ రచన చేస్తున్నారు. ఓ వైపు సిట్టింగ్ ఎంపీలు.. మరోవైపు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కారు దిగి హస్తం, కాషాయ గూటికి వెళ్లిపోతున్న పరిస్థితి..
తాను ఒక్కసారి మాటిస్తే మడమ తిప్పకుండా ఉంటానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. సోమవారం మాజీ సీఎం కేసీఆర్ (KCR) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి (BRS Party) చేరిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. రెండున్నర సంవత్సరాలుగా బీఎస్పీ పార్టీలో 50 వేల కిలోమీటర్ల వరకు యాత్ర చేసి, బహుజనులను చైతన్యపరిచామని చెప్పారు.
తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రికి పీఠాన్ని అందించిన కారు జోరుకు గతేడాది జరిగిన ఎన్నికల్లో హస్తం బ్రేకులు వేసింది.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా తనను నియమిస్తారని వచ్చిన వదంతులపై ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ స్పందించారు. తనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సంప్రదించిన మాట వాస్తవమేనని అన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ(BSP)కి గట్టి షాక్ తగిలింది. బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పార్టీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.