RS Praveen Kumar: దమ్ముంటే నిరూపించండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రవీణ్ కుమార్ సవాల్
ABN , Publish Date - Nov 30 , 2024 | 03:59 PM
దమ్ముంటే తన మీద విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. తన విద్యార్థులు గురుకులాల్లోనే కాదని.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటారని గుర్తుచేశారు.
హైదరాబాద్: గురుకులాల్లో జరుగుతున్న ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందనే అనుమానం ఉందని... ఆయన ఒక మాఫియాను నడిపించారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. దమ్ము ఉంటే తన మీద విచారణకు ఆదేశించాలని ఛాలెంజ్ చేశారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని అన్నారు. శనివారం ఏబీఎన్‌తో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. దమ్ముంటే తన మీద విచారణకు ఆదేశించాలని చెప్పారు. తన విద్యార్థులు గురుకులాల్లోనే కాదని.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటారని గుర్తుచేశారు. రూ. 99 కోట్లు కాదని.. రూ. 999 కోట్లు పేద విద్యార్థుల కోసమే ఖర్చు పెట్టానని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం మిది ...నిఘా వ్యవస్థలు మీ చేతిలోనే ఉన్నాయి’ అని అన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అనుకుంటే నేరుగా తన మీద విచారణ చేయించవచ్చు అని తెలిపారు. చిల్లర మాటలు కొండా సురేఖాకు సరి కావని ప్రవీణ్ కుమార్ అన్నారు.
తరచూ ఫుజ్ పాయిజన్ ఘటనలు..
కాగా.. ఇటీవల గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్ వాడీ కేంద్రాల్లో తరచూ ఫుజ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు ఆహారం కలుషితం అయ్యింది. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రి పాలవ్వగా.. చికిత్సపొందతూ ఓ విద్యార్థిని మృతిచెందింది. ఫుజ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం సైతం దాఖలైంది. దీంతో అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్.. ఫుడ్ పాయిజన్ కారణాలు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిందని అన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లాస్థాయి అధికారితో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనలపై విచారణ చేసి రిపోర్టును ఈ కమిటీ ప్రభుత్వానికి అందించనుంది.
కొండా సురేఖ ఏమన్నారంటే..
మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వాంకిడిలో శైలజ అనే విద్యార్థి మరణిస్తే రాజకీయాలకు వాడుకున్నారని ఇది బాధాకరమని చెప్పారు. ఆ అమ్మాయి మరణం బాధాకరమని... ఆ అమ్మాయి కుటుంబానికి బీఆర్ఎస్ నేతలు ఏం సహాయం చేశారని ప్రశ్నించారు. కోటి రూపాయలు ఇవ్వచ్చుగా అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో మరణాలు చాలా జరిగాయని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు చాలా ఉన్నాయని చెప్పారు. ఆనాడు కనీసం బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అధికారులపై చర్యలు తీసుకోలేదని.. కానీ తాము నలుగురిపై సస్పెన్స్ వేటు వేశామని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. పెట్టుబడులు రావొద్దనే ఉద్దేశ్యంతో కలెక్టర్‌పై హత్యకు కుట్ర చేశారన్నారు..
రాష్ట్రాన్ని దివాళా తీసినా తాము అభివృద్ధి చేస్తున్నామన్నారు. సైకో రావు కలెక్టర్‌ను ఇష్టానుసారం తిట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ను ఓడించినా గులాబీ నేతలకు సిగ్గు రాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూ సేకరణ చేశారని... కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని.. చేసిన తప్పుల్లో జైల్‌కు వెళ్తానని కేటీఆర్‌కు తెలుసని... కానీ ప్రజల కోసం జైల్‌కు వెళ్తున్నట్లు స్వతంత్ర సమరయోధునిలా ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎలా కూలుతుందని నిలదీశారు. కేటీఆర్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారని... ఆయన చెల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ సంతోషంగా ఉన్నారని. కానీ కవిత బయటకు వచ్చాక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కుట్రలన్నింటిపై విచారణ చేయిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కవిత, హరీష్‌రావు ఒక్కటయ్యారని కేటీఆర్‌కు భయం పట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. సైకో రామ్ ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కేటీఆర్ జైల్‌కు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని... కేసీఆర్ కూడా సమయం వచ్చినప్పుడు జైల్‌కు వెళ్తారని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Mahesh Kumar Goud: పార్టీ కేడర్‌కు పీసీసీ చీఫ్ కీలక సూచన
TG Govt: లగచర్ల భూసేకరణ... నిన్న రద్దు.. నేడు నోటిఫికేషన్
Read Latest Telangana News And Telugu News