Home » Sabitha Indra Reddy
తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ నిరసన తెలిపారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ.. సబిత రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆదరించి చేరదీసిందని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(Telangana CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలనే అంటవా? వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు మాజీ మంత్రి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Sessions) మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. సభ ప్రారంభం కాగానే.. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా.. అది కాస్త ఎక్కడెక్కడికో పోయింది...
తెలంగాణ రాష్ట్రంలో వరస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థ కావడం లేదంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మహిళల గురించి మాట్లాడి 48గంటలు కాకముందే వరస అత్యాచార ఘటనలు వెలుగు చూడడం విచారకరమని సబితా అన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో రేవంత్ సర్కారు విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె సోమవారం శాసనసభలో మాట్లాడారు.
బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్‌పై మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి సబితారెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని.. ఆమెకు గౌరవం ఇవ్వకపోతే అడగాలని.. మర్యాద లోపం ఉంటే తప్పు పట్టాలని అన్నారు.
Telangana: ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు కార్యక్రమాలు చేస్తున్నారని.. అధికారులు వారిని స్టేజి మీద కూర్చోబెడున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... పార్టీ కండువాలు కప్పుకుని ఓడిన అభ్యర్థులు చెక్కులు పంపిణీ చేస్తున్నారన్నారని సబిత అన్నారు.
బోనాల పండుగకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తలెత్తిన ప్రొటోకాల్ రగడ వివాదానికి దారితీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్(BRS, Congress) శ్రేణులు బాహాబాహీకి తలపడడంతో ఉద్రిక్తతతకు దారితీసింది.
తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఊహించని పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎప్పుడు గులాబీ కండువా తీసేసి..