Share News

Hyderabad: ఆడవాళ్లపై జరుగుతున్న ఘోరాలపై మహిళా కమిషన్‌ స్పందించదేం?

ABN , Publish Date - Aug 18 , 2024 | 04:52 AM

పొరపాటున మాట్లాడిన మాటలపై కేటీఆర్‌ హుందాగా క్షమాపణ చెప్పినా... కొందరు కాంగ్రెస్‌ మహిళా నేతలు ఇంకా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ అన్నారు.

Hyderabad: ఆడవాళ్లపై జరుగుతున్న ఘోరాలపై మహిళా కమిషన్‌ స్పందించదేం?

  • కేటీఆర్‌ వ్యాఖ్యలపై చర్యలు.. ఆశ్చర్యకరం

  • మాజీ మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): పొరపాటున మాట్లాడిన మాటలపై కేటీఆర్‌ హుందాగా క్షమాపణ చెప్పినా... కొందరు కాంగ్రెస్‌ మహిళా నేతలు ఇంకా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 8 నెలల్లో మహిళలపై 1800 అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు. మహిళలపై ఇన్ని నేరాలు, ఘోరాలు జరుగుతున్నా స్పందించని మహిళా కమిషన్‌ కేటీఆర్‌ పొరపాటున మాట్లాడిన వ్యాఖ్యలపై అంత వేగంగా చర్యలు తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.


ఇద్దరు మహిళా మంత్రులు రాజకీయం కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. తమని అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎం అనకూడని మాటలు అంటే మహిళా కమిషన్‌, మంత్రులు ఎక్కడికెళ్లారని ప్రఽశ్నించారు. హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్‌ దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని, హరీశ్‌రావును రాజీనామా కోరే అర్హత సీఎంకు లేదని పేర్కొన్నారు.

Updated Date - Aug 18 , 2024 | 04:52 AM