Share News

Telangana: ఎవరి సంస్కారం ఏంటో అందరికీ తెలుసు.. బీఆర్ఎస్ మహిళా నేతలు ఫైర్..

ABN , Publish Date - Aug 17 , 2024 | 02:13 PM

కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరిష్ రావులు టార్గెట్‌గా కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం నాడు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాని దేవి ప్రెస్‌మీట్‌లో ..

Telangana: ఎవరి సంస్కారం ఏంటో అందరికీ తెలుసు.. బీఆర్ఎస్ మహిళా నేతలు ఫైర్..
Sabitha Indra Reddy

హైదరాబాద్, ఆగష్టు 17: కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరిష్ రావులు టార్గెట్‌గా కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం నాడు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాని దేవి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తొలుత సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలపై కావాలనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పొరపాటున మాట్లాడానని హుందాగా మహిళలకు క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. కేటీఆర్ సంస్కారం గురించి కేసీఆర్‌పై మంత్రి సీతక్క మాట్లాడుతున్నారని.. కేసీఆర్ నేర్పించిన సంస్కారం ఏంటో కేటీఆర్ చెప్పిన క్షమాపణతో అర్థం అవుతోందని సబిత కౌంటర్ ఇచ్చారు.

రాష్ట్రంలో విద్యార్థులు, మహిళలపై జరుగుతున్న హత్యాచారాలపై మహిళా మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారామె. షాద్ నగర్ ఘటనపై మహిళా కమీషన్ ఎందుకు స్పందించడం లేదని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో తమపై ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్‌పై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పొరపాటున మాట్లాడానని ముఖ్యమంత్రి కనీసం మాటనైనా చెప్పకుండా రాక్షసానందం పొందారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సంస్కారవంతులు ఎవరో.. సంస్కారం హీనులు ఎవరో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. సీతక్క మీద సోషల్ మీడియా ట్రోల్స్‌పై స్పందించిన సీఎం.. తమపై చేసిన కామెంట్స్‌పై ఎందుకు స్పందించలేదని సబిత ప్రశ్నించారు.


మహిళల రక్షణపై శ్రద్ధ పెట్టండి..

కేటీఆర్‌పై మాటల దాడి.. హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నామన్నారు సునీతా లక్ష్మారెడ్డి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇద్దరూ నిలదీసినందుకే వారిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. మహిళల విషయంలో కేటీఆర్ మాట దొర్లడంతో సారీ కూడా చెప్పారన్నారు. రాజకీయ లబ్ధి కోసం మహిళా మంత్రులు, కాంగ్రెస్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డితో సీతక్కకు సారీ చెప్పించామని గుర్తు చేశారు. కానీ, అదే అసెంబ్లలో తమను అవమానించిన సీఎం కనీసం క్షమాపణ చెప్పలేదని విమర్శించారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. హరీష్ సవాల్‌తోనే రైతులకు రుణమాఫీ చేశారన్నారు. పూర్తి రుణమాఫీ చేయకుండానే చేశామని చెబుతున్నారని దుయ్యబట్టారు. మహిళా కమీషన్ సుమోటోగా తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. మహిళా భద్రత, షీ టీమ్స్ ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ముందుగా మహిళల రక్షణపై శ్రద్ధ పెట్టండని ప్రభుత్వాని హితవు చెప్పారు సునితీ లక్ష్మారెడ్డి.


అవన్నీ డైవర్ట్ రాజకీయాలు..

కాంగ్రెస్ నేతలు డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ వాణి దేవి విమర్శించారు. మహిళ విషయంలో కేటీఆర్ పొరపాటుగా కామెంట్స్ చేశారని.. ఆ వెంటనే క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు. ఏ మనిషైనా తప్పులు చేస్తారని.. దొర్లిన తప్పులకు హుందాగా కేటీఆర్ క్షమాపణలు చెప్పారన్నారు. చిన్న విషయాలను పెద్దగా చేయొద్దని కాంగ్రెస్ నేతలకు వాణి దేవి హితవు చెప్పారు. హరీష్ రావు ఇంటిమీద దాడి చేయడం ఏంటి? అని కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు మాని.. విద్యారంగ సమస్యలు పట్టించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.


Also Read:

సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలే పెట్టండి...

ఆ బాలికల ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

తగ్గేదే లే.. నిగ్గదీసి అడుగుతాం..!!

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 17 , 2024 | 02:13 PM