Home » Sajjala Bhargava Reddy
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్చార్జి సజ్జల భార్గవ్ రెడ్డి డ్రైవర్ ఆడిన దొంగ అరెస్టు నాటకం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందని తేలింది.
కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో కాలకూట విషం చిమ్మే ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు అనేక సంచలన విషయాలు వెల్లడించారు.
సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డికి ఏపీ పోలీసులు మరోసారి షాకిచ్చారు. అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు వారిని దేశం దాటకుండా ఉండేందుకు కట్టడి చేశారు. ఈ మేరకు తాజా నోటీసలు జారీ చేశారు.
వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జిగా సజ్జల భార్గవ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాతే బూతులు పెరిగాయని కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆదేశాల మేరకు వారి అనుచరులు ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు క్యాన్సర్తో భాదపడుతున్నారని, అది మూడో దశలో ఉందని ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు వైసీపీ (YSR Congress) సోషల్ మీడియా టీమ్ చీఫ్ సజ్జల భార్గవరెడ్డికి ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది..
కేంద్ర ఎన్నికల సంఘం సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) తనయుడు.. సజ్జల భార్గవ రెడ్డికి(Sajjala Bhargava Reddy) పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనపై సీఐడీ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడిపై(Chandrababu Naidu) వైసీపీ(YCP) తప్పుడు ప్రచారం చేస్తోందంటూ..
ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం వైసీపీ శ్రేణులకు అలవాటుగా మారిపోయింది.