Share News

Sajjala Bhargava Reddy : ఒకే అంశంపై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు అనుమతించొద్దు

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:28 AM

సోషల్‌ మీడియాలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టానంటూ వివిధ పోలీసు స్టేషన్లలో తన పై కేసులు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ...

Sajjala Bhargava Reddy : ఒకే అంశంపై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు అనుమతించొద్దు

  • హైకోర్టులో సజ్జల భార్గవరెడ్డి పిటిషన్‌

అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టానంటూ వివిధ పోలీసు స్టేషన్లలో తన పై కేసులు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకే అంశం పై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో శ్రీసత్యసాయిజిల్లా రొద్దం పోలీసులు నమోదు చేసిన కేసును మొదటి ఎఫ్‌ఐఆర్‌గా పరిగణించి, ఇదే వ్యవహారం పై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను వాంగ్మూలాలుగా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Updated Date - Dec 24 , 2024 | 06:28 AM