Share News

AP High Court : సజ్జల భార్గవపై తొందరపాటు చర్యలొద్దు

ABN , Publish Date - Dec 31 , 2024 | 06:43 AM

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారనే ఆరోపణలతో రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 9 కేసుల్లో

AP High Court : సజ్జల భార్గవపై తొందరపాటు చర్యలొద్దు

  • మధ్యంతర ఉత్తర్వులు మరోవారం పొడిగింపు

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారనే ఆరోపణలతో రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 9 కేసుల్లో వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరో వారం రోజులు పొడిగించింది. తదుపరి విచారణను జనవరి 7కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Dec 31 , 2024 | 06:43 AM

News Hub