Home » Sand Mafia
కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కళ్లు గప్పి ఇసుక దోపిడీ చేస్తున్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదుల్లో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. రెండు టన్నుల బకెట్ సామర్థ్యం గల జేసీబీలు ఉపయోగించి నదులను గుల్ల చేస్తూ ఇసుక తోడేస్తున్నారు.
రాష్ట్రంలో 2019 సెప్టెంబరు వరకు ఉచిత ఇసుక విధానం అమలైంది. ఆ తర్వాత ఉచితాన్ని ఎత్తేశారు. 2020లో గనుల శాఖకు వెంకటరెడ్డి డైరెక్టర్గా వచ్చారు.
మాజీ సీఎం జగన్ అండతో గనుల శాఖను సొంత సామ్రాజ్యంగా మలుచుకున్న అప్పటి డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిపై అవినీతి నిరోధక శాఖ గురువారం కేసు నమోదు చేసింది.
రామచంద్రపురం మండలం వెల్లసావరం జగనన్నకాలనీలో ఇసుక దొంగలు పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 వేల టన్నుల ఇసుకను రాత్రికి రాత్రే తరలించేశారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు తోడు దొంగలుగా మారి ఈ బాగోతాన్ని నడిపించారు.హౌసింగ్ ఏఈ కేవీ భాస్కర్ ఫిర్యాదుతో వారిపై ద్రాక్షారామ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ద్రాక్షారామంలో పేదల ఇళ్లస్థలాల లేఅవుట్లో ఉంచిన ఇసుకను కేటుగాళ్లు మాయం చేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన 70లారీల ఇసుకను రాత్రికి రాత్రే దోచేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన ఇసుక అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని ఆపేసింది. బినామీలను రంగంలోకి దించింది. ఆన్లైన్ చెల్లింపులు నిలిపేసి.. నదీ తీరాన్ని తోడేసింది..!
‘కరువు రహిత రాష్ట్ర నిర్మాణమే నా లక్ష్యం. ఇందుకోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా. రెండేళ్లు వర్షాలు లేకపోయినా ఇబ్బందులు లేకుండా భూమినే జలాశయంగా మార్చాలి. అందుకు నదుల అనుసంధానం ఒక్కటే మార్గం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుకను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తరలివచ్చి ఉచితాన్ని ఆరంభించారు. సర్కారు మధ్యంతర ఇసుక పాలసీని ప్రకటిస్తూ జీవో నం. 43ను జారీ చేసింది.
ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కష్టాలు ఇక ఉండవు. అన్ని వర్గాల ప్రజలకూ ఇసుక ఉచితంగా అందుబాటులోకి రానుంది. తెలుగుదేశం కూటమి సర్కారు ప్రకటించిన ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.
ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా తేలడంతో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ హయాంలో.....