Sand Mafia: రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. విచక్షణా రహితంగా దాడి..
ABN , Publish Date - Oct 20 , 2024 | 09:21 AM
మంగళగిరిలో హరికృష్ణ, రామకృష్ణ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని సురేశ్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై కక్షగట్టిన నిందితులు అదును చూసి మూకుమ్మడి దాడికి తెగబడ్డారు.
గుంటూరు: మంగళగిరి (Mangalagiri) నియోజకవర్గంలో ఇసుక మాఫియా (Sand Mafia) రెచ్చిపోయింది. ఓ యువకుడిపై విచక్షణా రహితంగా ఇసుక మాఫియా గ్యాంగ్ దాడికి తెగబడింది. అధికారులకు సమాచారం ఇస్తూ తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని మూకుమ్మడి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
వైసీపీ హయాం నుంచీ గుండిమేడ, ప్రాతూరు, చిర్రావూరు ఇసుక క్వారీలలో హరికృష్ణ, రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కనిపించిన ప్రతి ఇసుక దిబ్బనూ తరలిస్తూ రెచ్చిపోతున్నారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రావడంతో వీరి ఆడగాలను అడ్డుకునేందుకు సురేశ్ అనే యువకుడు ముందుకొచ్చాడు.
మంగళగిరి నియోజకవర్గంలో హరికృష్ణ, రామకృష్ణ అక్రమంగా ఇసుక తరలిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై కక్షగట్టిన నిందితులు అదును చూసి మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. తీవ్రంగా కొట్టి గాయపరిచారు. తమ గురించి ఫిర్యాదు చేస్తావా అంటూ రెచ్చిపోయారు. తీవ్ర గాయాలైన బాధితుడు సురేశ్ ఘటనపై మంగళగిరి పోలీసులను ఆశ్రయించాడు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. దాడి ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హరికృష్ణపై ఇప్పటికే పలు నేరాల కింద వివిధ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Kadapa: దారుణం.. ఇంటర్ విద్యార్థిని హత్య.. సీఎం చంద్రబాబు సీరియస్..