Home » Sangareddy
విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య దూరాన్ని తగ్గించడానికి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌లో ఏఆర్-వీఆర్ ల్యాబ్ ఏర్పాటైంది.
సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌కు చెందిన కొందరు యువకులు చేపట్టిన విహారయాత్ర విషాదంగా మిగిలింది. మహారాష్ట్రలోని పుణె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు.
నిమ్జ్ వల్ల ఈ ప్రాంతంలో 3 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని వైద్యా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) తెలిపారు. నిమ్జ్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన అని చెప్పారు.
సంగారెడ్డి: తెలంగాణలోని వేర్వేరు జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందగా మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణంలో ఒక్కో అడుగు ముందుకుపడుతోంది. రెండు నెలల్లో టెండర్లకు వెళ్లనుండగా.. అక్టోబరులో ఉత్తర భాగం పనులు మొదలుకానున్నాయి. నిర్మాణం ప్రారంభించేందుకు అనువుగా రహదారికి సాంకేతికంగా ఒక నంబరు (వర్కింగ్ టైటిల్) ఇవ్వాల్సి ఉంటుంది.
శారీరక లోపం జీవితంలో ఎదుగుదలకు, లక్ష్య సాధనకు అడ్డంకి కాదని నిరూపించింది ఆ యువతి. కళ్లు లేకపోయినా సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతి
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తక్కువ కాంక్రీటును వినియోగించి, అత్యంత వేగంగా దేశంలోనే తొలిసారిగా పాదచారుల వంతెనను ఐఐటీ-హెచ్ శాస్త్రవేత్తలు నిర్మించారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ-హెచ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రమణ్యం తన బృందంతో దీన్ని క్యాంపస్ ప్రాంగణంలో నిర్మించారు.
నాణ్యమైన వైద్య విద్యను అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ప్రైవేటు కాలేజీలపై హెల్త్ యూనివర్సిటీ పర్యవేక్షణ ఉండగా.. ఇక నుంచి సర్కారే పర్యవేక్షించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీలో పలుచోట్ల గందరగోళం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లోని ‘ముందుమాట’లో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం..
సంగారెడ్డి జిల్లా అందోల్‌లో బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పాలనపరమైన అనుమతులు మంజూరు చేసింది.