Share News

Sangareddy: ఐఐటీహెచ్‌లో ఏఆర్‌-వీఆర్‌ ల్యాబ్‌ ప్రారంభం..

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:13 AM

విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య దూరాన్ని తగ్గించడానికి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌లో ఏఆర్‌-వీఆర్‌ ల్యాబ్‌ ఏర్పాటైంది.

Sangareddy: ఐఐటీహెచ్‌లో ఏఆర్‌-వీఆర్‌ ల్యాబ్‌ ప్రారంభం..

కంది, జూలై 4: విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య దూరాన్ని తగ్గించడానికి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌లో ఏఆర్‌-వీఆర్‌ ల్యాబ్‌ ఏర్పాటైంది. దీనిని ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి, ఇన్ఫోవిజన్‌ సహ వ్యవస్థాకుడు సీన్‌ యలమంచి గురువారం ప్రాంభించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా ఇన్ఫోవిజన్‌ సహకారంతో ఐఐటీ-హెచ్‌ ప్రాంగణంలో ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌)- వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.


ఈ ల్యాబ్‌ విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేందుకు, అభ్యాసానికి మూలస్తంభంగా మారనుంది. ల్యాబ్‌ ప్రారంభం సందర్భంగా సీన్‌ యలమంచి మాట్లాడుతూ.. పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్‌తో భాగస్వామిగా మారినందుకు గర్వంగా ఉందన్నారు. ఏఆర్‌-వీఆర్‌ ల్యాబ్‌ ద్వారా తమ విద్యార్ధులకు సరికొత్త సాంకేతిక పురోగతులను అందించడంలో మరో ముందడుగు వేసినట్టు ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి పేర్కొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 05:14 AM