Home » Sangareddy
‘‘అయ్య పేరు చెప్పి కుర్చీలో కూర్చున్నానంటూ సీఎం రేవంత్‌రెడ్డి నాపై పదే పదే విమర్శలు చేస్తున్నాడు. సీఎం హోదాలో ఉండి కేసీఆర్ పట్ల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన విమర్శలకు నేనూ సమాధానం చెప్పదల్చుకున్నా. రేవంత్‌రెడ్డి లాగా ఆంధ్రోళ్ల బూట్లు నాకి, సంచులు మోసి, పార్టీలు మారి.. నేను రాజకీయాల్లోకి రాలే.’’
Telangana: మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సిద్ధిపేటలోని శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లింగోద్బవ సమయాన స్వామి వారికి ఆలయ అర్చకులు... మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అర్థరాత్రి సమయాన ఆలయ తోటబావి వద్ద పంచవర్ణాలతో 42 వరుసలతో ఆలయ ఒగ్గు పూజరులచే పెద్ద పట్నం నిర్వహణ జరుగనుంది.
Telangana: సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలన అని అన్నారు. రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలన్నారు.
Telangana: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే సంగారెడ్డి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఆపై బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఒరిస్సాకు ప్రధాని బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
PM Modi Telangana vist Live: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) మంగళవారం సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పటాన్చెరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. అంతకుముందు ఆయన రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
Telangana: తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరణను వృథా కానివ్వను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పటేల్‌గూడలో ఏర్పాటు చేసిన సభలో.. ‘‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’’ అంటూ మోదీ తెలుగులో స్పీచ్ మొదలుపెట్టారు.
Telangana: రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని పటేల్ గూడకు చేరుకున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లింగంపల్లి- ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రైలును ప్రధాని వర్చ్‌వల్‌గా ప్రారంభించారు. దాదాపు రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు.
సంగారెడ్డి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచే ఆయన రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
సంగారెడ్డి: జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందోల్ మండలం, మాసాన్ పల్లి శివారులోని సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది.
Telangana: ఫ్రెండ్స్ అన్నాక దావత్‌లు చేసుకోవడం కామన్. పండగొచ్చినా.. పబ్బమొచ్చినా ఫ్రెండ్స్ పార్టీలు చేసుకోవాల్సిందే. స్నేహితులు గ్రూప్‌గా ఏర్పడి పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాగే ఓ వ్యక్తి సైతం తన స్నేహితులకు దావత్ ఇచ్చాడు.