Jaggareddy: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ ఇవ్వండి
ABN , Publish Date - May 10 , 2024 | 06:55 AM
మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించినా పర్వాలేదు కానీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎ్‌సపై కాంగ్రె్‌సకు భారీ మెజారిటీ ఇవ్వాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.
మళ్లీ నన్ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినా పర్వాలేదు కానీ..
కష్టపడ్డ వారికే స్థానిక సంస్థల్లో అవకాశాలు
2 రోజలు విస్తృతంగా ప్రచారం చేయండి
బీఆర్‌ఎ్‌సతోనే కాంగ్రె్‌సకు ప్రధాన పోటీ
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
కొండాపూర్, మే 9: మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించినా పర్వాలేదు కానీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎ్‌సపై కాంగ్రె్‌సకు భారీ మెజారిటీ ఇవ్వాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డి సమీపంలోని మల్కాపూర్ వద్ద ఓ ఫంక్షన్ హాలులో గురువారం నాడు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మెదక్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో కాంగ్రె్‌సకు 100 ఓట్ల మెజారిటీ తగ్గకుండా చూడాలని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారిని గెలిపించే బాధ్యత తనదేనని చెప్పారు. కష్టపడే వారికే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 13న పోలింగ్ ఉన్నందున రెండు రోజుల పాటు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. తమకు బీఆర్‌ఎ్‌సతోనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, అధికారం లేనందువల్లనే ఓటమి చవిచూశామన్నారు. ప్రస్తుతం అధికారం ఉన్నందున నియోజకవర్గంలో పుష్కలమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. నియోజకవర్గంలో ఒక్క ఓటు తక్కువ వచ్చినా అవమానంగా భావించాల్సి వస్తుందన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం గ్రామ, వార్డుస్థాయి నాయకులే భారం మోయాలని సూచించారు. తాను నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేసి తన వంతు భారం మోశానని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచిన నాయకులు ఈ ఎన్నికల్లో తమ వంతు భారం భరించి భారీ మెజారిటీ ఇచ్చేందుకు కష్టపడాలన్నారు. ఈ రెండు రోజులు కష్టపడి నీలం మధును గెలిపించుకుంటే ఐదేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్ కార్యకర్తలుగా మీకు మంచి పేరు వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కుసుమ్ కుమార్, తోపాజీ అనంతకిషన్, మనోజ్‌రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కుమార్, నర్సింహరెడ్డి, ఆంజనేయులు, మునిపల్లి సత్యనారాయణ, రాంరెడ్డి, రఘుగౌడ్, మోతీలాల్, సంతోష్, బుచ్చిరాములు, వై.ప్రభు, జాన్సన్ పాల్గొన్నారు.