Share News

BJP: కాంగ్రెస్ వస్తే మళ్లీ దేశమంతా బాంబులు పేలుతాయి: రఘునందన్‌రావు

ABN , Publish Date - May 07 , 2024 | 01:57 PM

సంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం సంగారెడ్డిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ..

BJP: కాంగ్రెస్ వస్తే మళ్లీ దేశమంతా బాంబులు పేలుతాయి: రఘునందన్‌రావు

సంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా మెదక్ (Medak) బీజేపీ ఎంపీ అభ్యర్థి (BJP MP Candidate) రఘునందన్‌రావు (Raghunandan Rao)కు మద్దతుగా తమిళనాడు (Tamilnadu) బీజేపీ అధ్యక్షుడు (BJP Chief) అన్నామలై (Annamalai) మంగళవారం సంగారెడ్డి (Sangareddy)లో నిర్వహించిన బైక్ ర్యాలీ (Bike Rally)లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) వస్తే అయోధ్య స్థానంలో మళ్లీ బాబ్రీ మసీదు కడతారని, మళ్లీ దేశమంతా బాంబులు పేలుతాయని అన్నారు. అదే బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే కేవలం దీపావళికి మాత్రమే బాంబులు పేలుతాయన్నారు. బీజేపీ నుంచి రాజకీయం మొదలు పెట్టిన జగ్గారెడ్డి (Jaggareddy) బీజేపీ లేదని మాట్లాడుతున్నారని, సంగారెడ్డి హిందువుల అడ్డ అని పేర్కొన్నారు. అయోధ్య ప్రారంభానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gabdhi) ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జగ్గారెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నారని, సంగారెడ్డిని జగ్గారెడ్డి బహిష్కరించడం కాదు.. ప్రజలే జగ్గారెడ్డిని బహిష్కరించారని రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు.


అన్నమలై కామెంట్స్..

45 డిగ్రీల ఎండలో కూడా ఇక్కడ కార్యకర్తలు సూర్యుడినే భయపెడుతున్నారని.. ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు ఎంటనేది అందరికీ తెలిసిపోయిందని అన్నమలై అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఎన్నికలు అయ్యాక మిగిలిన పార్టీలో ఎవరు ప్రధాని అని గొడవలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో రాహుల్ కూడా అయోమయంలో ఉన్నారని, తెలంగాణలో అభివృద్ధి కావాలంటే కమలం వికసించాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు. అబద్ధాలతో ప్రభుత్వాన్ని అందుకున్నారని, దేశ భవిష్యత్తు రక్షణ కావాలంటే అది మోదీతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్‌కు రామ మందిరాన్ని తాకే హక్కు కూడా లేదన్నారు. మేము రక్తం చిందించి తెచ్చిన అన్ని చట్టాలను కాంగ్రెస్ వస్తే రద్దు చేస్తుందని.. బీజేపీ మతాలకు అతీతమైన పార్టీ అని అన్నమలై వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అధికారం కోసం బీజేపీ ఎలాంటి పనికైనా బరితెగిస్తుంది..

అనకాపల్లిలో పోటెత్తిన ప్రజాగళం..

ఓటమి భయంతో వైసీపీ దాడులు: కన్నా..

మోదీ మాటలతో జగన్‌లో టెన్షన్.. టెన్షన్..

జగన్ ప్రభుత్వానికి అదే ఉరితాడు..

జగన్‌ బేల మాటలు!

పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 07 , 2024 | 01:59 PM