Lok Sabha Election 2024:మోదీ పాలనలో అచ్చె దిన్ కాదు చచ్చే దిన్ వచ్చింది.. కేసీఆర్ ఫైర్
ABN , Publish Date - May 08 , 2024 | 10:32 PM
మోదీ పాలనలో అచ్చె దిన్ రాలేదు కాని.. చచ్చే దిన్ మాత్రం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోపించారు. ప్రధాని మోదీ గత పదేళ్లలో ఇచ్చిన 150 హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా బుధవారం కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. పటాన్ చెరు జాతీయ రహదారిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
సంగారెడ్డి జిల్లా: మోదీ పాలనలో అచ్చె దిన్ రాలేదు కాని.. చచ్చే దిన్ మాత్రం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోపించారు. ప్రధాని మోదీ గత పదేళ్లలో ఇచ్చిన 150 హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా బుధవారం కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. పటాన్ చెరు జాతీయ రహదారిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Narendra Modi: రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో తర్వాత అర్థమైంది
మోదీ గత ఎన్నికల్లో గెలిస్తే విదేశాల్లో నల్లదనం తెచ్చి ఇంటింటికీ రూ.15 లక్షలు ఇస్తానన్నారని.. ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. పాకిస్థాన్ ఉగ్రదాడులను బూచిగా చూపించి మోదీ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయాలని మోదీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలకే కాదు మోదీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని అన్నారు. పెట్టుబడి దారులకు కాపలా దారుడిగా ఉన్నారే తప్ప ఎవరికీ బీజేపీ హయాంలో మేలు జరగలేదని అన్నారు.తన హయంలో కనురెప్ప పాటులో కూడా కరెంటు పోలేదని చెప్పుకొచ్చారు.
V.Hanumanthrao: మరోసారి మోదీ వస్తే... అదానీ, అంబానీలను కోటీశ్వరులను చేస్తారు తప్ప..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తెలంగాణలో రియల్ రంగం కుప్పకూలిందని ఆరోపించారు. పటాన్ చెరులో ఒకప్పుడు కలుషిత జలాలతో ప్రజలు ఇబ్బంది పడేవారని.. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథతో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు, కేసీఆర్ పై తిట్లతో కాళం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కిట్లు, విద్యార్థులకు స్కాలర్ షిప్ , ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదని విరుచుకుపడ్డారు. కరెంట్ లేక పరిశ్రమలు వెనక్కు వెళ్తున్నాయని చెప్పుకొచ్చారు. నదుల్లో నీళ్లు కూడా తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రం మళ్లీ సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే బీఆర్ఎస్ ఎంపీలను ఈ ఎన్నికల్లో గెలిపించాలని అన్నారు. పటాన్ చెరు పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే పోలీసులను కేసీఆర్ హెచ్చరించారు.
Komatireddy Venkatreddy: వచ్చే పదేళ్లు రేవంతే సీఎం.. జూన్ 5కి వారంతా కాంగ్రెస్‌లోకి..
Read Latest Telangana News And Telugu News