Home » SC Classification
ఎస్సీ వర్గీకరణ కోసం అకుంఠిత దీక్షతో పోరాడామని, ఈ ప్రయాణంలో ఎందరినో కోల్పోయామని, చివరికి ధర్మమే గెలిచిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించినందున తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి షెడ్యూల్డు కులాల (ఎస్సీ) ఏబీసీడీ వర్గీకరణను అమలు చేసే బాధ్యత తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
షెడ్యూల్డు కులాల్లో ఉప కులాలను వర్గీకరించి రిజర్వేషన్ ఫలాలు వారికి అందజేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఓబీసీ ఉప కులాలకు వర్గీకరణ మాటేమిటన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
మాదిగ దండోరా (ఎమ్మార్పీఎస్ ఉద్యమం) పుట్టింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మారుమూల గ్రామం ఈదుముడిలో..! అదివరకే ఆ ఊరిలో సామాజిక స్పృహ కలిగిన మాదిగ యువకులు చెరువు నీళ్ళ కోసం, భూపంపకాల్లో సమన్యాయం కోసం పోరాడిన సందర్భాలున్నాయి.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీజేపీలో జోష్ వ్యక్తమవుతోంది. వర్గీకరణ అంశాన్ని తాము ఎన్నికల కోణంలో కాకుండా సామాజిక కోణంలోనే చూశామని, ఫలితంగా మున్ముందు మాదిగ సామాజికవర్గం తమకు అండగా ఉంటుందని భావిస్తోంది.
కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరవేసింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ఉప వర్గీకరణ ఆమోద యోగ్యమేనని, ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉప వర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలో ప్రత్యేక కోటా ...
ఎస్సీవర్గీకరణకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నా రు. పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో గురువారం ఎమ్మార్పీఎస్ నా యకులు రామాంజనేయులు, కోనాపురం పెద్దన్న, బీజేపీ జిల్లా కార్యదర్శి రామక్రిష్ణ తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్న మాట ప్రకారం కమిటీని ఏర్పాటు చేశారు. క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
PM Modi Telangana Tour : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం నాడు (నవంబర్-11న) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ’కు ప్రధాని హాజరుకాబోతున్నారు...