Share News

Hyderabad: ‘ఎస్సీ వర్గీకరణ’పై మంత్రుల కమిటీ

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:37 AM

షెడ్యూల్డు కులాల(ఎస్సీ) వర్గీకరణపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐదుగురు మంత్రులు ఉండగా.. ఒక ఎంపీ ఉన్నారు.

Hyderabad: ‘ఎస్సీ వర్గీకరణ’పై మంత్రుల కమిటీ

  • ..ఐదుగురు మంత్రులు, ఒక ఎంపీ

  • చైర్మన్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • సుప్రీం తీర్పుపై అధ్యయనం,

  • సిఫారసులకు ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డు కులాల(ఎస్సీ) వర్గీకరణపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐదుగురు మంత్రులు ఉండగా.. ఒక ఎంపీ ఉన్నారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా, మంత్రులు దామోదర, దుద్దిళ్ల, పొన్నం, సీతక్కతో పాటు ఎంపీ మల్లు రవిని సభ్యులుగా నియమించారు.


ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఎస్సీల వర్గీకరణ చేపట్టాలంటూ ఆగస్టు 1న సుప్రీం తీర్పును అనుసరించి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తీర్పును అధ్యయనం చేయాలని, ఉప వర్గీకరణకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించాలని కమిటీకి తెలిపింది. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణపై ఎలా ముందుకు వెళ్లాలో సూచిస్తూ ప్రభుత్వానికి సిఫారసులు చేయాలని ఆదేశించింది.

Updated Date - Sep 13 , 2024 | 04:41 AM