Home » Secunderabad Cantonment
హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అతివేగంగా వచ్చిన లాస్య నందిత కారు ముందున్న టిప్పర్ లేదా రెడీమిక్స్ వాహనాన్ని ఢీ కొట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సమయంలో ఆరు టిప్పర్ లారీలు ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లినట్లు గుర్తించారు.
#RIP LasyaNanditha బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) దుర్మరణంతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది..? అసలు ఈ ఘటనకు ముందు ఏం జరిగింది..? లాస్య ఎక్కడికెళ్లి తిరిగొస్తున్నారు..? మార్గమధ్యలో ఏదైనా జరిగిందా..? ఇలా ఒకటా రెండా పదుల సంఖ్యలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) పరిశీలనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి...
Lasya Post Mortem Report హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. ఘటనకు సంబంధించి పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను డాక్టర్లు రిలీజ్ చేశారు. ఈ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు.. అనుచరులు నివ్వెరపోతున్నారు. ఈ రేంజ్‌లో ప్రమాదం జరిగిందా..? అంటూ అనుచరులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి..
Lasya Nanditha Dies In Road Accident: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్, ఎమ్మెల్యే పీఏ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు చేయగా కేవలం రెయిలింగ్‌ను ఢీకొనడం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరగలేదన్న అంచనాకు వచ్చారు. దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే.. ప్రమాదం ఎప్పుడు.. ఎలా జరిగింది..? అనే విషయాలపై ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను అడిగి పోలీసులు ఆరా తీశారు..
#RIPLasya Nanditha: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురవ్వడంతో.. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూశారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది..? ఎప్పుడు, ఎలా జరిగింది..? అని అభిమానులు, అనుచరులు ఆరా తీస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు...
ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం దుర్మరణం పాలైన ఘటన తెలంగాణలో సంచలనం రేపుతోంది. తెల్లవారుజామునే కావడంతో ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి విషయాలైతే తెలియడం లేదు. కారును పూర్తిగా పరిశీలించి పోలీసులు ఇప్పుడిప్పుడే ఓ అంచనాకు పోలీసులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ట్విస్ట్ ఒకటి వెలుగు చూసింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. కనీసం ఎమ్మెల్యేగా ఆమె పదవిని చేపట్టి ఏడాది కూడా కాకమునుపే కన్నుమూశారు. లాస్య నందితకు ఎమ్మెల్యే గా కాలం కలిసి రాలేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తొలుత లిప్ట్‌లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి ఆమె బయటి పడ్డారు.
హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జి.సాయన్న అకాల మరణంతో ఖాళీ అయిన కంటోన్మెంట్ టికెట్ హాట్ కేక్‌లా మారింది. అధికార పార్టీలో అరడజను మంది టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఏకైక ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్ ఇదే కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు టికెట్ నాకంటే.. నాకు అని ప్రచారం చేసుకున్నారు. కానీ చివరకు ఎమ్మెల్యే టికెట్ సాయన్న కుమార్తె లాస్య నందితకే దక్కింది.
‘పొడుస్తున్న పొద్దు మీద’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు..! బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది..! భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది..! నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు.. వేల ఆందోళనల్లో కదంతొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసింది..!