Share News

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్యను వెంటాడిన ప్రమాదాలు..

ABN , Publish Date - Feb 23 , 2024 | 09:43 AM

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. కనీసం ఎమ్మెల్యేగా ఆమె పదవిని చేపట్టి ఏడాది కూడా కాకమునుపే కన్నుమూశారు. లాస్య నందితకు ఎమ్మెల్యే గా కాలం కలిసి రాలేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తొలుత లిప్ట్‌లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి ఆమె బయటి పడ్డారు.

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్యను వెంటాడిన ప్రమాదాలు..

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. కనీసం ఎమ్మెల్యేగా ఆమె పదవిని చేపట్టి ఏడాది కూడా కాకమునుపే కన్నుమూశారు. లాస్య నందితకు ఎమ్మెల్యేగా కాలం కలిసి రాలేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.

అన్నీ తప్పించి!

  • తొలుత లిప్ట్‌లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి ఆమె బయటి పడ్డారు.

  • ఆ తరువాత నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవ సారి‌ ప్రమాదానికి గురయ్యారు.

  • మూడవ సారి ఓఆర్ఆర్ (ORR) వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ (Nalgonda) ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందారు. ఆ సమయంలో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పది రోజులు గడువక‌ ముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది.

  • అన్ని గండాలు తప్పించిన భగవంతుడు ఈ ఒక్కసారి గట్టెక్కించి ఉంటే బాగుండేదని అభిమానులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఓఆర్ఆర్ వద్ద డివైడర్‌ను ఢీ కొని లాస్య కారు పల్టీలు కొట్టింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఆమె ఇంటర్నల్ ఆర్గాన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు చెబుతున్నారు. లాస్య మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital)కి తరలించారు. కూతురి మరణవార్త విని లాస్య తల్లి స్పృహ కోల్పోయారు. ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.


ఇంకా చదవండి


Lasya Nanditha: కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి


Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం ఎలా జరిగింది.. కారణాలేంటి..!?



Updated Date - Feb 23 , 2024 | 09:50 AM