Lasya Nanditha: లాస్య కారు ప్రమాదంపై వెలుగులోకి షాకింగ్ న్యూస్..
ABN , Publish Date - Feb 23 , 2024 | 11:12 AM
ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం దుర్మరణం పాలైన ఘటన తెలంగాణలో సంచలనం రేపుతోంది. తెల్లవారుజామునే కావడంతో ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి విషయాలైతే తెలియడం లేదు. కారును పూర్తిగా పరిశీలించి పోలీసులు ఇప్పుడిప్పుడే ఓ అంచనాకు పోలీసులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ట్విస్ట్ ఒకటి వెలుగు చూసింది.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) కారు ప్రమాదం దుర్మరణం పాలైన ఘటన తెలంగాణ (Telangana)లో సంచలనం రేపుతోంది. తెల్లవారుజామునే కావడంతో ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి విషయాలైతే తెలియడం లేదు. కారును పూర్తిగా పరిశీలించి పోలీసులు (Police) ఇప్పుడిప్పుడే ఓ అంచనాకు పోలీసులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ట్విస్ట్ ఒకటి వెలుగు చూసింది. ఇప్పటి వరకూ కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొనడంతో ఇంత ఘోర ప్రమాదం జరిగిందని అంతా భావిస్తున్నారు. కానీ తాజాగా కారును పరిశీలించిన పోలీసులు కేవలం రెయిలింగ్‌ను ఢీకొనడం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరగలేదన్న అంచనాకు వచ్చారు.
రెయిలింగ్‌తో పాటు ముందున్న లారీని సైతం లాస్య నందిత కారు ఢీ కొట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతివేగంగా వచ్చిన కారు ముందున్న వాహనాన్ని ఢీకొట్టినట్లు ఆనవాళ్లు కనిపించాయి. కారు బ్యానెట్ పైభాగం పూర్తిగా ధ్వంసమైంది. కారుకు ఎడమవైపు ఉన్న ముందు చక్రం సైతం పూర్తిగా ధ్వంసమైంది. మీటర్ బోర్డ్ 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. నందిత కారు బ్యానెట్ పై భాగంలో అంటుకొని ఉన్న ఇసుక క్లూస్‌ను పోలీసులు సేకరించారు. ఔటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్‌ను ఢీ కొడితే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చని నిపుణులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..