Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు
ABN , Publish Date - Feb 23 , 2024 | 02:34 PM
Lasya Post Mortem Report హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. ఘటనకు సంబంధించి పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను డాక్టర్లు రిలీజ్ చేశారు. ఈ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు.. అనుచరులు నివ్వెరపోతున్నారు. ఈ రేంజ్‌లో ప్రమాదం జరిగిందా..? అంటూ అనుచరులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి..
హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. ఘటనకు సంబంధించి పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను డాక్టర్లు రిలీజ్ చేశారు. ఈ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు.. అనుచరులు నివ్వెరపోతున్నారు. ఈ రేంజ్‌లో ప్రమాదం జరిగిందా..? అంటూ అనుచరులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి.
రిపోర్టులో ఏముంది..?
పోస్టుమార్టం రిపోర్టు ప్రాథమిక నివేదిక ప్రకారం.. ‘లాస్య తలకు బలమైన గాయాలు అయ్యాయి. తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. లాస్య ఆరు దంతాలు ఊడిపోయాయి. శరీరం లోపల ఎముకలు చాలా వరకు దెబ్బతిన్నాయి. తలకు బలమైన గాయాలు కావడంతో స్పాట్‌లోనే చనిపోయింది. సీట్ బెల్ట్ పెట్టుకొకపోవడమే తీవ్ర గాయాలకు కారణం’ అని డాక్టర్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం (శుక్రవారం) 05 గంటలకు మారెడ్‌పల్లి స్మశాన వాటికలో లాస్య నందిత అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు లాస్య ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
క్లారిటీ లేదుగా..!
కాగా.. లాస్య సీటు బెల్టు పెట్టుకుందని కొందరు అంటుంటే.. అబ్బే అదేం లేదని ఇంకొందరు అంటున్నారు. అంతేకాదు.. లాస్య ఫ్రంట్ సీటులో కూర్చొని సీటు బెల్టు కూడా ధరించిందని.. ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయినట్లు ఆర్టీవో అధికారులు చెబుతున్న పరిస్థితి. దీనిపై సరైన క్లారిటీ రాకపోవడంతో అసలు ప్రమాదం ఎలా జరిగిందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. లోతుగా దర్యాప్తు చేస్తే కానీ ఈ ప్రమాదం జరిగిన తీరు తెలిసే అవకాశాల్లేవు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.
లాస్యకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి