Home » Secunderabad
రేపు, ఎల్లుండి (శని, ఆది) జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.434 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతుందని వెల్లడించారు.
Telangana: భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అయ్యింది. ఇప్పటికే గోల్కొండ అమ్మవారికి బోనమెత్తడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. అలాగే ఈనెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్‌లో పర్యటించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) నుంచి శ్రావణమాసం ప్రత్యేక రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ‘దివ్య జ్యోతిర్లింగ దర్శన యాత్ర’ పేరిట ఆగస్టు 4 నుంచి 12 వరకు పలు పుణ్యక్షేత్రాలను దర్శించేలా టూర్‌ను ప్లాన్ చేశారు.
ఖార్ఖాన, యాంటీ నార్కోటిక్ బ్యూరో (Anti Narcotic Bureau) పోలీసులు కలిసి డ్రగ్స్ వినియోగిస్తున్న 8మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్(North Zone DCP Rashmi Perumal) తెలిపారు. వారికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.
దశాబ్దాలుగా లక్షల మంది కంటోన్మెంట్ వాసుల ఎదురుచూపులు ఫలించాయి..! సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తోపాటు.. దేశంలోని అన్ని కంటోన్మెంట్లలో ఉన్న పౌర ప్రాంతాలను సమీప మునిసిపాలిటీలు/కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది.
కాజీపేట - బలార్ష మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జులై 7వ తేదీ వరకు 78 రైళ్లు రద్దు చేసినట్లు, అలాగే 36 రైళ్లను మరో మార్గంలో మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
సికింద్రాబాద్(secunderabad) ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫేమస్ ఆల్ఫా హోటల్(Alpha Hotel) గురించి నగరవాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హోటల్ గురించి సోషల్ మీడియా(social media)లో ఇటివల పలు వార్తలు, పుకార్లు ప్రచారం వచ్చాయి. వీటిపై హోటల్ యాజమాన్యం స్పందించి, అలాంటివి నమ్మోద్దని ప్రజలకు సూచించింది. అసలేమైందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆలుగడ్డ బావి వద్ద ఉన్న రైల్వే వాషింగ్ సైడ్ వద్ద ఆగి ఉన్న ఓ కొత్త రైలు రెండు బోగీలకు మంటలంటుకొని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు.
కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వస్తున్న గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఘన స్వాగతం పలకనుంది.