Share News

South Central Railway: హైదరాబాద్ - న్యూఢిల్లీ మార్గంలో పలు రైళ్లు రద్దు

ABN , Publish Date - Jun 27 , 2024 | 02:27 PM

కాజీపేట - బలార్ష మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జులై 7వ తేదీ వరకు 78 రైళ్లు రద్దు చేసినట్లు, అలాగే 36 రైళ్లను మరో మార్గంలో మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

South Central Railway: హైదరాబాద్ - న్యూఢిల్లీ మార్గంలో పలు రైళ్లు రద్దు

హైదరాబాద్, జూన్ 27: కాజీపేట - బలార్ష మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జులై 7వ తేదీ వరకు 78 రైళ్లు రద్దు చేసినట్లు, అలాగే 36 రైళ్లను మరో మార్గంలో మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్ డివిజన్‌లోని ఆసిఫాబాద్ - రెచ్నీ స్టేషన్ల మధ్య ఈ మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపింది. కాజీపేట్- బలార్ష సెక్షన్‌లో కొనసాగుతున్న పనుల కారణంగా హైదరాబాద్‌ను గోరఖ్‌పూర్, రక్సుల్‌తో కలిపే రైళ్లతోపాటు సికింద్రాబాద్‌ను హజ్రత్ నిజాముద్దీన్, పట్నా, రక్సుల్, దానాపూర్, సబ్‌దర్‌గంజ్‌లతో అనుసంధానించే రైళ్లను సైతం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.


రద్దు అయిన రైళ్లు...

రైలు నెంబర్: 17003 కాజీపేట - షోలాపుర్ ఎక్స్‌ప్రెస్ (Train No. 17003 Kazipet-Solapur Express)

రైలు నెంబర్: 17004 బలార్ష - ఖాజీపేట ఎక్స్‌ప్రెస్ ( Train No.17004 Balharshah-Kazipet Express)

రైలు నెంబర్: 12757 సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ (Train No.12757 Secunderabad-Sirpur Kagaznagar Express)

రైలు నెంబర్: 20805: విశాఖపట్నం - న్యూఢిల్లీ

రైలు నెంబర్: 20806: న్యూఢిల్లీ - విశాఖపట్నం

రైలు నెంబర్:12803: విశాఖపట్నం - నిజాముద్దీన్

రైలు నెంబర్:12804: నిజాముద్దీన్ - విశాఖపట్నం


దారిమళ్లింపు..

12590: సికింద్రాబాద్ - గోరఖ్‌పూర్ ( మజ్రి, పింపల్, ఖుతి, ముద్కేడ్, నిజామాబాద్ మీదగా నడవనుంది)

12589: గోరఖ్‌పూర్ - సికింద్రాబాద్ (మజ్రి, పింపల్, ఖుతి, ముద్కేడ్, నిజామాబాద్ మీదగా నడవనుంది)

12723: సికింద్రాబాద్- న్యూఢిల్లీ ( మజ్రి, పింపల్, ఖుతి, ముద్కేడ్, నిజామాబాద్ మీదగా నడవనుంది)

12724: న్యూఢిల్లీ - సికింద్రాబాద్ ( మజ్రి, పింపల్, ఖుతి, ముద్కేడ్, నిజామాబాద్ మీదగా నడవనుంది)

12791: సికింద్రాబాద్- దానాపూర్ ( జులై 4, 6 తేదీల్లో 72 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనుంది)

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 27 , 2024 | 02:28 PM