Home » Sharad Pawar
మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముంబైలోని తన నివాసంలో ఎన్సీపీ నేతలను అజిత్ పవార్ కలుసుకున్నారు. అయితే, ఈ సమావేశం గురించి తనకు తెలియదని పుణెలో ఉన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చెప్పారు.
మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు ఆయన సమీప బంధువు అజిత్ పవార్ గట్టి ఝలక్ ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది.
విపక్షాల ఐక్య కూటమి ప్రయత్నాల కోసం బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం ఫలప్రదమైందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని తామంతా నిర్ణయించామని బీహార్ ముఖ్యమంత్రి, ఐక్య కూటమి ఏర్పాటుకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న జేడీయూ నేత నితీష్ కుమార్ తెలిపారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల విషయంలో ఆ పార్టీ సుప్రీం శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. తన కుమార్తె సుప్రియా సూలే. సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే అజిత్ పవార్‌కు నియామకాల్లో చోటు దక్కలేదు. దీనిపై శరద్ పవార్ వివరణ ఇచ్చారు. అజిత్ ఇప్పటికే అసెంబ్లీలో ఎన్సీపీ విపక్ష నేతగా బాధ్యతలు నిర్వస్తున్నారని, పార్టీ డెసిషన్ మేకర్స్‌లో అజిత్ కూడా ఉన్నారని చెప్పారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే , ప్రఫుల్ పటేల్ ను ఆ పార్టీ సుప్రీం శరద్ పవార్ శనివారంనాడు ప్రకటించారు. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవార్ ఈ నియామకాలు చేశారు. పవార్, పీఏ సంగ్మా కలిసి 1999లో ఎన్సీపీని స్థాపించారు.
మరాఠా దిగ్గజ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్‌లో తనకు ఈ మెసేజ్ వచ్చినట్టు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే e) చెప్పారు. ఆ విషయమై సుప్రియ, పలువురు ఎన్సీపీ నేతలు ముంబై పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు చేసిన ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభమవడం పట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవార్
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం జరిగిన తీరుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పొద్దుటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలు చూసిన తర్వాత తనకు ఏమాత్రం సంతోషం కలిగించలేదని అన్నారు.
ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు