Home » Siddipet
‘‘తెలంగాణ రాష్ట్రం.. మూర్ఖ ముఖ్యమంత్రి, మూర్ఖ ప్రభుత్వం చేతుల్లో ఉంది. కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి గద్దెనెక్కింది. గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది. మోసపోతే గోసపడుతాం.. జాగ్రత్తగా అలోచించి ఓటేయాలి.
Telangana: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండ సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ‘‘మీ బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. కేసీఆర్ సీఎం, హరీష్ రావు మంత్రి అయ్యారు అంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే. నరేంద్ర మోదీ ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.
కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్న తమ తండ్రికి చికిత్స చేయించేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేయాలంటూ ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్నారు.
నలభై ఏళ్ల నుంచి సిద్దిపేట నియోజకవర్గాన్ని మామ అల్లుడు పాపాల భైరవుల్లాగా పట్టి పీడిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఏకిపారేస్తున్నారు. గురువారం కుక్నూర్ పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునందన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Telangana: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోనీ 35,36 వార్డులలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డి పాల్గొన్నారు.
Telangana: మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్రావు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బుధవారం పట్టణంలోని నెహ్రు పార్క్ నుంచి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్కు జనం నీరాజనాలు పడుతున్నారన్నారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అనేది రాజశేఖర్ రెడ్డి అయితే.. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అది కేసీఅర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం కొండపాక మండల కేంద్రంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి ( Kishan Reddy) అన్నారు. కాంగ్రెస్ (Congress) గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా: కోహెడలోని వెంకటేశ్వర గార్డెన్లో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఆరుగురు బీఆర్ఎస్ మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నాలుగు నెలల తమ పాలనలో ఆరు గ్యారంటీలలో చేయాల్సినవి అమలు చేశామని స్పష్టం చేశారు.