Share News

Raghunandanrao: మీ ఎమ్మెల్యే కేసీఆర్‌ను టీవీలో చూసి సంతోషపడాల్సిందే తప్ప..

ABN , Publish Date - May 02 , 2024 | 01:29 PM

Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఏకిపారేస్తున్నారు. గురువారం కుక్నూర్ పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునందన్‌ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Raghunandanrao: మీ ఎమ్మెల్యే కేసీఆర్‌ను టీవీలో చూసి సంతోషపడాల్సిందే తప్ప..

సిద్దిపేట, మే 2: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను (BRS Chief KCR) మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు (BJP MP Candidate Raghunandan Rao) ఏకిపారేస్తున్నారు. గురువారం కుక్నూర్ పల్లి మండల కేంద్రంలో బీజేపీ (BJ) ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునందన్‌ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతో (MLC Kavitha) పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కూలీలకు ఉపాధి హామీ పథకం కింద 157 రూపాయలు ఇస్తే మోదీ ప్రభుత్వం వచ్చాక 300 రూపాయలు ఉపాధి హామికింద డబ్బులు పెంచడం జరిగిందన్నారు. ‘‘మీ ఎమ్మెల్యే కేసీఆర్‌ను మీరు టీవీలో చూసి సంతోషపడాలి తప్ప ఇంతవరకు ఆయన మీ దగ్గరకు రాలేదు. బతుకమ్మ ఆడితే పైసలు వస్తలేవని చెల్లె ఢిల్లీ పోయి సారా దుకాణం దందా మొదలుపెట్టింది’’ అంటూ కవితపై సెటైర్ విసిరారు.

Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్


రేవంత్ రెడ్డిని నమ్మి గెలిపించుకుంటే 4వేల పెన్షన్ ఇంతవరకు రాలేదని విమర్శించారు. చెయ్యి గుర్తుకు ఓటు వేస్తే తల మీద మొండి చెయ్యి పెట్టారు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. సూటుకేసుల ఆశతో వెంకట్రామిరెడ్డి వెంట హరీష్ రావు తిరుగుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాల మోదీ పాలనలో దేశం చల్లగా ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాంబుల వర్షం కురుస్తదని ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

AP Elections: తిరగబడుతున్న ఓటర్లు.. ఆ నేతల్లో టెన్షన్..

TDP: టీడీపీ వర్గీయులపై కత్తులతో దాడి చేసిన వైసీపీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 02 , 2024 | 01:53 PM