Home » Singareni Collieries
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ ‘సింగరేణిని బతికిద్దాం.. మనం బతుకుదాం’ అని ఆ సంస్థ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
మేజర్ మినరల్స్‌కు సంబంధించిన గనుల వేలంపై పీడముడి పడింది. కొన్ని గనుల వేలానికి కేంద్రం అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరేళ్లుగా ఎలాంటి స్పందనా లేదు. ఏదైనా మేజర్ మినరల్‌కి సంబంధించిన గనుల వేలం ప్రక్రియ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రానికి గడిచిన పదేళ్లలో ఎంతో చేశామని, భవిష్యత్తులోనూ మరెంతో చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
సింగరేణిలో పనిచేస్తూ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ పేర్కొన్నారు.
సింగరేణి ఓపెన్‌కా్‌స్ట ప్రాజెక్టులో ప్రమాదం సంభవించింది. పైపులైన్ లీకేజీ మరమ్మతు చేస్తున్న ఇద్దరు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. మరో ఇద్దరు కా ర్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం బుధవారం ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) వ్యవస్థాపకుల్లో ఒకరైన మహ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్‌ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారంతా ప్రభుత్వ ఉద్యోగులే.. కానీ పేదలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం నిధుల కోసం కక్కుర్తి పడ్డారు. కూలీలుగా పని చేస్తున్నట్లు జాబ్ కార్డులు సృష్టించి.. డబ్బును స్వాహా చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో గత రెండేళ్లుగా ఈ అక్రమాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఒడిసాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనిలో తవ్వకాలకు మార్గం సుగమమైంది. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్పందించిన ఒడిసా సర్కారు ఇటీవల అటవీ అనుమతులు మంజూరు చేసింది.
సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలం జాబితా నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో తెలంగాణ సర్కార్‌కు 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలున్నాయని ఆయన గుర్తు చేశారు.