Singareni Collieries: సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:19 AM
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కీలకమైన రెండు డైరెకర్ పోస్టుల నియామకం చేపట్టింది. డైరెక్టర్ ఆపరేషన్‌గా ఎల్‌వి. సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్‌గా కొప్పుల వెంకటేశ్వర్లును నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

డైరెక్టర్ ఆపరేషన్‌గా సూర్యనారాయణ
ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్‌గా వెంకటేశ్వర్లు
రుద్రంపూర్(సింగరేణి), గోదావరిఖని, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కీలకమైన రెండు డైరెకర్ పోస్టుల నియామకం చేపట్టింది. డైరెక్టర్ ఆపరేషన్‌గా ఎల్‌వి. సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్‌గా కొప్పుల వెంకటేశ్వర్లును నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత పది రోజులుగా సింగరేణిలో డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉండటం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం రెండు డైరెక్టర్ల పోస్టులకు ఐదుగురు జనరల్ మేనేజర్లను ఇంటర్వ్యూలకు పిలిచి ఇద్దరిని ఎంపిక చేసింది.
డైరెక్టర్ ఆపరేషన్‌గా నియమితులైన ఎల్‌వి. సూర్యనారాయణ శ్రీరాంపూర్ ఏరియా జీఎంగా పనిచేస్తుండగా.. డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్‌గా నియమితులైన కొప్పుల వెంకటేశ్వర్లు ఆడ్రియాల ప్రాజెక్టు జనరల్ మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు. నూతన డైరెక్టర్ల నియామకం పట్ల సింగరేణి అధికారుల సంక్షేమ సంఘం, కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.