Singareni: సింగరేణిలో ఇద్దరు కార్మికుల సజీవ సమాధి..
ABN , Publish Date - Jul 18 , 2024 | 03:50 AM
సింగరేణి ఓపెన్‌కా్‌స్ట ప్రాజెక్టులో ప్రమాదం సంభవించింది. పైపులైన్ లీకేజీ మరమ్మతు చేస్తున్న ఇద్దరు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. మరో ఇద్దరు కా ర్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
మరమ్మతు చేస్తుండగా కూలిన మట్టి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
రామగుండం-3 డివిజన్ ఓసీపీ-2లో
ఘటన.. కిషన్‌రెడ్డి విచారం
మరమ్మతు పనులు చేస్తుండగా కూలిన మట్టి
మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు
రామగుండం-3 డివిజన్ ఓసీపీ-2లో ఘటన
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం
రామగిరి/హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఓపెన్‌కా్‌స్ట ప్రాజెక్టులో ప్రమాదం సంభవించింది. పైపులైన్ లీకేజీ మరమ్మతు చేస్తున్న ఇద్దరు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. మరో ఇద్దరు కా ర్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రామగుండం-3 డివిజన్ పరిధి ఓసీపీ-2లో ఈ ఘటన చోటుచేసుకుంది. క్వారీలోని సౌత్‌కోల్ ఏరియాలో సైడ్‌వాల్ లోపల పైపులైన్ లీకేజీ అవుతుండడంతో బుధవారం నలుగురు కార్మికులు మరమ్మతు పనులు చేపట్టారు. అయితే హైవాల్‌లో బురద మట్టి(ఓబీ) వర్షానికి నానిపోయి ఒక్కసారిగా కార్మికులపై కూలింది.
దీంతో సింగరేణి టెక్నీషియన్(ఫిట్టర్) ఉప్పుల వెంకటేశ్వర్లు(58), జనరల్ మజ్దూర్ కార్మికుడు గాదం విద్యాసాగర్(55) ఆ మట్టిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. కాగా, కూలిన మట్టిలో వచ్చిన బండరాళ్లు అక్కడే పనిచేస్తున్న మరో ఇద్దరు జనరల్ మజ్దూర్ కార్మికులు శ్రీనివా్‌సరాజు, మాదాం సమ్మయ్యకు తగలడంతో.. వారికి తీవ్రగాయాలయ్యాయి. క్వారీలోని మిగతా కార్మికులు ఘటనా స్థలానికి చేరుకొని కూలిన మట్టిని షావల్ సహాయంతో తొలగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.గాయపడ్డ కార్మికులకు తొలుత స్థానిక సెంటినరీ కాలనీలోని డిస్పెన్సరీలో ప్రథమ చికిత్స అం దించి.. తర్వాత గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మృతుల్లో.. ఉప్పుల వెంకటేశ్వర్లు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, గాదం విద్యాసాగర్ గోదావరిఖనికి చెందిన వ్యక్తి. ప్రమాద ఘటనపై సింగరేణి సీఎండీ బలరాం విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. కాగా, సింగరేణి కార్మికులు మృతి చెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మికుల భద్రత విషయంలో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.