Home » Sonia Gandhi
ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi)తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం నాడు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీకి చేరుకున్నారు.
అయోధ్య రామాలయంలో ఈనెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని హాజరుకావాలంటూ వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తిరస్కరించడంపై బీజేపీ తొలిసారి స్పందించింది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ చింతించాల్సి వస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పురి అన్నారు.
అయోధ్య రామజన్మభూమిలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కోసం హిందువులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తాము మాత్రం హాజరుకాబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం బీజేపీ, ఆర్ఎస్ఎస్ పొలిటికల్ మైలేజీ కోసం చేస్తోన్న ఈవెంట్ అని మండిపడింది.
ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ( Sonia Gandhi ) ని తెలంగాణలో పోటీ చేయాలని కోరామని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ( Jaggareddy ) అన్నారు. సోమవారం నాడు MCRHRDలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల ఎమ్మేల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన వారిని పిలిచారని జగ్గారెడ్డి అన్నారు.
అయోధ్య (Ayodhya) రామజన్మభూమిలో మరో రెండు వారాల్లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట జరగనుంది. దేశంలోనే గాక విదేశాల్లో ఉన్న ప్రముఖులకు శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది. ఒక్కొక్కరికి స్వయంగా ఇన్విటేషన్ కార్డు అందజేస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఎపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నేడు (గురువారం) కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ఆమె హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్‌లో ‘ఎక్స్’ వేదికగా ఆమె తొలిసారి స్పందించారు.
6 గ్యారెంటీలను వందరోజుల్లోగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) పేర్కొన్నారు. సోమవారం నాడు ఖమ్మంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తుమ్మల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ... ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియాగాంధీ ఆశీస్సులతో సుపరిపాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi)ని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్(Digvijaya Singh) ధృవీకరించారు.