Share News

Ayodhya: రామమందిర ప్రాణ ప్రతిష్టకు సోనియా, ఖర్గే దూరం.. ఎందుకంటే..?

ABN , Publish Date - Jan 10 , 2024 | 05:17 PM

అయోధ్య రామజన్మభూమిలో రామ్‌‌లల్లా ప్రాణ ప్రతిష్ట కోసం హిందువులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తాము మాత్రం హాజరుకాబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం బీజేపీ, ఆర్ఎస్ఎస్ పొలిటికల్ మైలేజీ కోసం చేస్తోన్న ఈవెంట్ అని మండిపడింది.

 Ayodhya: రామమందిర ప్రాణ ప్రతిష్టకు సోనియా, ఖర్గే దూరం.. ఎందుకంటే..?

న్యూఢిల్లీ: అయోధ్య (Ayodhya) రామజన్మభూమిలో రామ్‌‌లల్లా ప్రాణ ప్రతిష్ట కోసం హిందువులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రముఖులకు రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఆహ్వానించారు. హాజరుకాబోమని కాంగ్రెస్ (Congress) పార్టీ స్పష్టంచేసింది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం బీజేపీ (BJP), ఆర్ఎస్ఎస్ (RSS) ఈవెంట్ అని హాట్ కామెంట్స్ చేసింది.

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని గత నెలలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge), కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi), లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అదిర్ రంజన్ చౌదరికి ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఆహ్వానించారు. శ్రీరాముడిని లక్షలాది మంది పూజిస్తారని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు చెబుతున్నారు. మతం అనేది వ్యక్తిగత అంశమని వారు అభిప్రాయపడ్డారు. గత కొన్నిరోజులుగా బీజేపీ, ఆరెస్సెస్ ఆ ఘటనను రాజకీయ అంశంగా మలిచాయని విమర్శించారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడటంతో ప్రారంభించడానికి బీజేపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారని విమర్శించారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల మైలేజ్ కోసం చేపట్టిన స్టంట్‌గా అభివర్ణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 05:17 PM