Home » Sri Satyasai
నియోజకవర్గంలో విష సంస్కృతిని విడనాడాలని టీడీపీ ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. శుక్రవారం అమరాపురం మండలం గొల్లమారనపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త మంజునాథ్ అనే రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు పత్తి మొక్కలను పెరికి వేశారు. ఎకరా పొలంలో క్రాస్ పత్తి మొక్కలను పెరికి వేశారని, రూ.6లక్షల వరకు న ష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం, ప్రజాస్వామ్యవాదులు అసహ్యించుకునే రీతిలో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తున్న వాతావరణం పూర్తిస్థాయిలో నెలకొందని కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు పలు చోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నేతలు, అధికార గణం అండదండలతో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు ప్రముఖ చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్‌కు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కోసం తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్‌ను ప్రకటించాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా: నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం మండలం బత్తలపల్లి తహసీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు ఇష్టారాజ్యంగా కట్టబెట్టారని యోగేశ్వరి దేవిపై ఇదివరకే ఆరోపణలు వచ్చాయి.
Andhrapradesh: దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో పరిటాల రవి వర్ధంతిని పురస్కరించుకుని భారీగా ఏర్పాట్లు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే శంకర్ నారాయణను మంత్రి ఉషశ్రీ చరణ్ టార్గెట్ చేశారు. ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల్లో ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఫోటో కనిపించకూడదంటూ మంత్రి హుకుం జారీ చేశారు.
Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితమే రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రాయంలో మోదీకి ఏపీ సర్కార్ ఘన స్వాగతం పలికింది. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి లేపాక్షి ఆలయానికి పీఎం చేరుకున్నారు.