Home » Stock Market
సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి విడుదలవుతున్న ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం, విదేశీ మదుపర్లు నిధుల ఉపసంహరణ కొనసాగిస్తుండడంతో దేశీయ సూచీలు నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నాయి. గురువారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు శుక్రవారం కూడా అదే బాటలో నడుస్తున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో కీలక రంగాల్లోనే స్టాక్స్ అమ్మకాల నేపథ్యంలో ప్రధాన బెంచ్మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సహా సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల కారణంగా దేశీయ సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి నష్టాల బాట పట్టిన సూచీలు బుధవారం ఉదయం నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికి కోలుకున్నాయి.
సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం కూడా అదే జోష్తో ప్రారంభమయ్యాయి. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల బాట పట్టాయి.
ప్రముఖ సూపర్ మార్కెట్ డీ మార్ట్ సంస్థ షేర్లు ఆకస్మాత్తుగా పడిపోయాయి. దీంతో ఈ కంపెనీ ఒక్కరోజులోనే రూ. 27,900 కోట్లను నష్టపోయింది. అయితే ఎందుకు ఇలా జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం గత రెండు వారాలుగా దేశీయ సూచీలను ఉక్కిరిబిక్కిరి చేసింది. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి.
మదుపర్లకు గుడ్ న్యూస్. వచ్చే వారం కీలక ఐపీఓలు మార్కెట్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్ ఇండియాతోపాటు పలు ఐపీఓలు రాబోతున్నాయి. ఆయా కంపెనీల వివరాలు ఏంటి, ఐపీఓలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నాయనే వివరాలను ఇక్కడ చుద్దాం
ఈ వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశీయ సూచీలు చివరకు నష్టాలతోనే వారాన్ని ముగించాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో దేశీయ సూచీలు జీవన కాల గరిష్టల నుంచి దిగి వచ్చిన సంగతి తెలిసిందే.
దేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ నావల్ టాటా (86) ఇక లేరు. అయితే ఆయన మృతి నేపథ్యంలో టాటా గ్రూపునకు చెందిన కంపెనీల స్టాక్స్ పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు స్టాక్ మార్కెట్లో పెరిగాయా, తగ్గాయా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.
ఆరు రోజుల నష్టాల నుంచి తేరుకుని మంగళవారం లాభాలు పండించిన దేశీయ సూచీలు బుధవారం లాభనష్టాలతో దోబూచులాడాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వడ్డీ రేట్లను యధాతథంగా ఉన్నట్టు ప్రకటించడంతో మదుపర్లు ఉత్సాహంగా కొనుగోళ్లకు దిగారు.