Share News

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు

ABN , Publish Date - Oct 17 , 2024 | 03:28 PM

భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో కీలక రంగాల్లోనే స్టాక్స్ అమ్మకాల నేపథ్యంలో ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సహా సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు
Stock markets huge losses

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) గురువారం (అక్టోబర్ 17న) భారీ నష్టాలతో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్‌లు పెద్ద ఎత్తున పడిపోయాయి. పలు రంగాలలో విస్తృతమైన అమ్మకాల నేపథ్యంలో ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సహా సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3.30 గంటలకు, బీఎస్‌ఈ సెన్సెక్స్ 495 పాయింట్లు క్షీణించి 81,006 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 220 పాయింట్లు పడిపోయి 24,750 స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 525 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 977 పాయింట్లను నష్టపోయింది.


టాప్ గెయినర్స్

ఈ నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 22 స్టాక్‌లు రెడ్‌లో ట్రేడయ్యాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (3.44 శాతం క్షీణించింది) నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకీ ఇండియా, ఇన్ఫోసిస్ ( 2.28 శాతం పెరిగింది), టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్ అండ్ టూబ్రో, SBI టాప్ గెయినర్లుగా ఉన్నాయి. నిఫ్టీ 50లో 50 స్టాక్‌లలో 10 గ్రీన్‌లో ట్రేడయ్యాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మాత్రమే లాభపడింది. దాదాపు ఒక శాతం ముందు ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ ఆటో (3.46 శాతం తగ్గింది), నిఫ్టీ రియాల్టీ (3.54 శాతం డౌన్) సూచీలు తగ్గిపోయాయి.


గంటల్లోనే

దీంతో మదుపర్లు కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు. బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎమ్‌సీజీ, మీడియా, మెటల్, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్ సూచీలు కూడా 1 శాతం కంటే తక్కువగా ట్రేడయ్యాయి. ఫార్మా ఇండెక్స్ కూడా నష్టాల్లోనే ఉంది. విస్తృత మార్కెట్లలో కూడా నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 వరుసగా 1.06 శాతం, 1.57 శాతం తక్కువకు చేరాయి. ఈ నేపథ్యంలో BSE సెన్సెక్స్ ఈరోజు (అక్టోబర్ 17, 2024న) ఇంట్రాడేలో 80,905.64 కనిష్ట స్థాయిని తాకింది.


మూడీస్ రేటింగ్స్

భారత్ తన పునరుత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో వేగంగా పురోగతి సాధించిందని మూడీస్ రేటింగ్స్ గురువారం పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, విస్తరిస్తున్న జనాభా కార్బన్ ఇంటెన్సివ్ ఉత్పత్తి డిమాండ్‌ను పెంచుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 2024లో వాస్తవ జీడీపీ 7.2 శాతం, 2025లో 6.6 శాతం వృద్ధితో భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతుందని మూడీస్ వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

Air Arabia: ఎయిర్ అరేబియా 'సూపర్ సీట్ సేల్' ఆఫర్.. ఇంకొన్ని రోజులు మాత్రమే

Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..

Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్


Business Idea: రైల్వేలో ఈ బిజినెస్ చేయండి.. వేల సంపాదనతోపాటు..


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 17 , 2024 | 03:46 PM