Tata Shares: రతన్ టాటా మృతి.. ఈ కంపెనీల షేర్లు తగ్గాయా, పెరిగాయా..
ABN , Publish Date - Oct 10 , 2024 | 10:46 AM
దేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ నావల్ టాటా (86) ఇక లేరు. అయితే ఆయన మృతి నేపథ్యంలో టాటా గ్రూపునకు చెందిన కంపెనీల స్టాక్స్ పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు స్టాక్ మార్కెట్లో పెరిగాయా, తగ్గాయా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్ రతన్ నావల్ టాటా (86)(Ratan Tata) కన్నుమూశారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన ముంబైలో తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం టాటా గ్రూప్ కంపెనీలపై పండిందా, పడితే ఏ మేరకు ప్రభావం ఉంది. ఎంత మేరకు ఆయా కంపెనీల స్టాక్స్(stock ) తగ్గాయా లేదా పెరిగాయానే అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం టాటా గ్రూప్ స్టాక్స్ ట్రేడింగ్ మిశ్రమంగా కొనసాగుతోంది.
తగ్గాయా..
ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ దాదాపు 2 శాతం క్షీణించగా, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీ బీఎస్‌ఈలో 4 శాతం వరకు పెరిగాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 15 టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీలలో 13 స్టాక్‌లు గ్రీన్‌లో ట్రేడవుతుండగా, మిగిలిన రెండు టాటా మోటార్స్ (1.6 శాతం క్షీణించి రూ. 924.35 వద్ద), ట్రెంట్ (0.10 శాతం క్షీణించి రూ. 8,211.45 వద్ద) స్థాయిలో ఉన్నాయి. దీంతోపాటు టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, తేజస్ నెట్‌వర్క్స్, వోల్టాస్, టాటా ఎల్క్సీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 1 శాతం నుంచి 4 శాతం వరకు పెరిగాయి.
నేడే ఫలితాలు
అయితే అతిపెద్ద టెక్ కంపెనీ TCS 2024-25 ఆర్థిక సంవత్సరం (Q2FY25) జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి తన ఆర్థిక పనితీరును అక్టోబర్ 10న వెల్లడించనుంది. FY24 సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే దాని టాప్‌లైన్, బాటమ్‌లైన్‌లో సింగిల్ డిజిట్ పెరుగుదల ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
సూచీలు
ఇక నేడు భారతీయ బెంచ్‌మార్క్ సూచీలైన BSE సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాలతో మొదలయ్యాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో లాభాలతో పాటు వాల్ స్ట్రీట్ కూడా రాత్రిపూట లాభాలను ట్రాక్ చేసింది. ఈ ప్రభావం భారత మార్కెట్లపై కనిపిస్తోంది. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 393 పాయింట్లు పెరిగి 81,860 వద్ద, నిఫ్టీ 50 108 పాయింట్లు పెరిగి 25,092 స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 308, 381 పాయింట్లు పుంజుకున్నాయి. సెక్టార్లలో ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఒత్తిడికి లోనవుతుండగా, మిగతా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.43 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.49 శాతం లాభపడటంతో విస్తృత మార్కెట్ సూచీలు కూడా ఎక్కువగా ట్రేడవుతున్నాయి.
ఇతర మార్కెట్లు
హాంకాంగ్ హాంగ్‌సెంగ్ ఇండెక్స్ 2.68 శాతం, చైనాలోని షాంఘై కాంపోజిట్ 0.81 శాతం, CSI 300 0.54 శాతం పెరిగింది. ఇంకోవైపు జపాన్‌కు చెందిన నిక్కీ 225 0.5 శాతం ఎగబాకగా, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.52 శాతం ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా S&P/ASX 200 0.66 శాతం ఎగబాకింది. బుధవారం సెన్సెక్స్ 167.71 పాయింట్లు క్షీణించి 81,467.10 వద్ద స్థిరపడింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ రేట్లను 6.5 శాతం వద్ద ఉంచుతామని ప్రకటించిన తర్వాత బుధవారం నిఫ్టీ ఇండెక్స్ 31.20 పాయింట్లు తగ్గి 24,981.95 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి:
Ratan Tata: టాటా గ్రూపు ఓనరైన రతన్ టాటా ఆస్తులు ఎంత.. కంపెనీ ప్రాపర్టీ ఎంత..
Ratan Tata: ఈ ఒక్క కారణంతో.. రతన్ టాటా విదేశాల నుంచి భారత్ వచ్చేశారు..
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Read More Business News and Latest Telugu News