Home » Student Fee
ఇంజనీరింగ్ కోర్సుల కనీస ఫీజును రూ.43వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఇచ్చిన జీవోలో కనీస ఫీజు రూ.40వేలుగా పేర్కొంది. గతేడాది కనీస ఫీజు రూ.43 వేలుగా ఉందని...
ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం రూ.వేల కోట్లు బకాయి పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఉన్నత విద్యాశాఖలో అడ్మిషన్ల గందరగోళం కొనసాగుతోంది. ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సుల కౌన్సెలింగ్‌పై అస్పష్టత నెలకొంది. షెడ్యూలు ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయా అనే దానిపై అస్పష్టత నెలకొంది.
చేనేత సహకార సంఘాల్లో బీఆర్ఎస్ సర్కారు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన వస్త్రమది! విలువ 130 కోట్లు!! ఈ వస్త్రంతో బడులు, సంక్షేమ హాస్టళ్లలోని పిల్లల కోసం యూనిఫాం, ఇతర దుస్తులు తయారు చేయించేందుకు, ప్రత్యేక దుస్తులకు ఎంబ్రాయిడరీతో సొబగులు అద్దించి,
రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఫీజు దోపిడీకి పాల్పడుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా యూనివర్సిటీల పేరిట అనుమతులు తెచ్చుకున్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి ఫీజు, డొనేషన్ రూపేణా రూ.12లక్షల దాకా వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.
నీట్ పేపర్ ఈజీగా వచ్చింది..! స్కోర్ పెరిగింది..! తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులనే సాధించారు..! దాంతో ఎంబీబీఎస్ ప్రవేశాలకు పోటీ భారీగా పెరిగి, ఈసారి కన్వీనర్ కోటా సీట్లు అంత ఈజీగా వచ్చే సూచనలు కనిపించడం లేదు. గతేడాది 450స్కోర్ ఉన్నా.. వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటు దక్కిం ది.
విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులను ఈ నెల 15లోగా నియమిస్తామని విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. 3 రోజుల్లో సెర్చ్ కమిటీల సమావేశాలను పూర్తిచేసి, కొత్త వీసీల నియామక ప్రక్రియను చేపడతామని వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సాఫ్ట్వేర్ ఫీల్డ్‌పై యువతలో ఉన్న మోజును కొన్ని కంపెనీలు క్యాష్ చేసుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ డబ్బులు తీసుకొని విద్యార్థులు మంచిగా నటిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడి భారీ మోసాలకు పాల్పడుతున్నాయి.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ వెల్లడైంది. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన అడ్మిషన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షి్‌పలు అందడంలేదు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు క్లియర్ కావడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే కంపెనీలకు బిల్లుల చెల్లింపు జరగడంలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకూ చెల్లింపుల్లేవు.