Home » Sunday
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) హవా నడుస్తోంది. అన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు రోడ్డెక్కుతున్నాయి. బ్యాటరీతో నడిచే ఈ వాహనాలపై ఉన్న ప్రాథమిక అనుమానాలను ఎప్పటికప్పుడు తీర్చుతూ, ఈవీలు ముందుకు దూసుకుపోతున్నాయి.
వంట చేయడానికే కాదు.. తినడానికే టైమ్ లేదు.. అంటోంది నేటి తరం. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ గబగబా నాలుగు మెతుకులు తిని.. మూతి తుడుచుకుని.. పనులకు పరిగెత్తడమే జీవితమైనప్పుడు తప్పడం లేదు. అందుకే ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. పుట్టగొడుగుల్లా ఫుడ్‌ట్రక్‌లు వచ్చేశాయ్!. అడగ్గానే క్షణాల్లో ఆహారపదార్థాలను అందించి.. ఆకట్టుకుంటున్నాయి.
నేతిలో వేగించిన బూడిదగుమ్మడి ముక్కలు, ముల్లంగి ముక్కలు, కీరదోస ముక్కల్ని జ్యూసు తీసుకుని రోజూ రెండు పూటలా తాగుతుంటే సమస్తమైన అనారోగ్యాలనూ తట్టుకునే శక్తి కలుగుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి.
సాధారణంగా డ్రైఫ్రూట్స్ అని పిలిచే వాటిల్లోనే బాదం, ఆక్రోట్, జీడిపప్పు, పిస్తా లాంటి గింజలను చేరుస్తాం. నిజానికి డ్రైఫ్రూట్స్ అంటే కేవలం ఎండబెట్టిన పండ్లు మాత్రమే. ఎండు ద్రాక్ష, ఎండిన అంజీర పండ్లు, ఎండిన ఆల్బక్రా పండు, ఎండు ఖర్జూరం మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.
కాంక్రీట్ జంగిల్‌కు దూరంగా, ప్రకృతి ఒడిలో... కులమతాలకు అతీతంగా... అందరూ ఒకచోట చేరితే... ‘ఆరోవిల్’ జీవన విధానం అచ్చంగా అదే. ఇక్కడ జాతి, లింగ వివక్ష లేనేలేదు. అంతకు మించి డబ్బుకు ప్రాధాన్యం శూన్యం. ఈ అద్భుత టౌన్షిప్ ఉన్నది ఎక్కడో కాదు...
పోర్చుగల్ ఫుట్‌బాల్ కెరటం రొనాల్డో క్రిస్టియానో. మైదానంలో నెట్లోకి అసమానమైన రీతిలో గోల్స్ కొట్టి, కోట్లాది హృదయాల్ని గెలుచుకున్న ఈ ఫుట్‌బాల్ వీరుడు.. ఇంటర్నెట్లోనూ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ ‘యువర్ క్రిస్టియానా’ను ప్రారంభిం చిన రెండు నెలలలోపే ఆరు కోట్ల మంది ఫాలో అవుతున్నారు.
ఆరేళ్ల క్రితం బాలీవుడ్లో విజయం సాధించిన ‘స్త్రీ’కి... కొనసాగింపుగా వచ్చిన ‘స్త్రీ 2’తో మరోసారి ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారింది శ్రద్ధాకపూర్. ప్రేక్షకులను భయపెట్టడంలో సూపర్ సక్సెస్ అయిన ఈ అందాల రాక్షసి చెబుతున్న తాజా విశేషాలివి...
రెండ్రోజులు వరుసగా కేవలం గంట నిద్ర తగ్గితేనే నిస్సత్తువగా ఉంటుంది. అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం రోజుకు కేవలం అరగంట మాత్రమే నిద్రపోతున్నాడంటే ముక్కున వేలేసుకుంటారు ఎవరైనా. అలాగని ఒకటి, రెండు కాదు... గత పన్నెండేళ్లుగా ఇదే పద్ధతిని అనుసరిస్తూ, పైగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు 40 ఏళ్ల డైసుకే హోరి.
పాపాయికి చకచకా స్నానం చేయించాలన్నా, సబ్బుతో బట్టలు మెరిపించాలన్నా, టూత్‌బ్రష్‌ని పరిశుభ్రంగా మార్చాలన్నా ఇకపై క్షణాల్లో పనే. వంటింట్లోనే కాదు... బాత్రూమ్లో కూడా ‘స్మార్ట్’గా పనిచేసే గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని...
ఇంతకు ముందు అపార్ట్మెంట్ అంటే పది పన్నెండు ఫ్లాట్స్‌తో ఉండేవి. నగరాలు పెరుగుతున్న కొద్ది అపార్ట్మెంట్ల విస్తీర్ణం, ఎత్తు పెరిగాయి. 100 నుంచి 500 కుటుంబాల దాకా నివాసం ఉండే భారీ అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. అయితే రష్యాలోని ఒక అపార్ట్మెంట్లో మాత్రం ఏకంగా 18 వేల మంది నివసిస్తున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు.