Home » Tamil Nadu
దీపావళి(Diwali) పండుగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే వారి కోసం 14,086 బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంకర్(Minister Sivashankar) తెలిపారు. సోమవారం సచివాలయంలో దీపావళికి ప్రత్యేక బస్సులను నడిపే విషయంపై ఆ శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. రవాణా శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఫణీందర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడులో లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సమైక్యతకు భంగం కలిగించేలా, తమిళ తాయి గేయంలో కొన్ని పంక్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించి కోట్లాది తమిళ ప్రజల మనస్సులను గాయపరిచిన గవర్నర్ ఆర్ఎన్.రవిని తక్షణం రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోనే మొదటిసారిగా వాణిజ్యనగరమైన కోయంబత్తూరు(Coimbatore)లో చెరువుపై తేలియాడే సోలార్ ప్యానెళ్లతో విద్యుత్ ఉత్పత్తి చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. నమక్కునామే పథకం కింద రూ.1.45 కోట్లతో జర్మన్‌కు చెందిన సంస్థతో కలిసి కోయంబత్తూరు కార్పొరేషన్ ఈ ప్రాజెక్టు చేపట్టింది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(State Deputy Chief Minister Udayanidhi) ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో డ్రెస్ కోడ్ పాటించేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్ దాఖలైంది.
వేలూరు(Vellore)లో రీల్స్‌పై మోజుతో ఓ యువకుడు ఆడవేషం ధరించి బైకును అత్యంత వేగంగా నడుపుతున్న దృశ్యాలతో ఓ వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. ఆ యువకుడు పొడవైన జడ, పూలు పెట్టుకుని వెనుక నుంచి చూస్తే అందమైన యువతిలాగే వేషం ధరించి ఆ బైకును వేలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో నడిపాడు.
నగరంలో, శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం ఆగి మూడు రోజులు దాటినా శివారు ప్రాంతాల్లోని వారంతా ఇంకా జలదిగ్బంధంలో ఉన్నారు. కార్పొరేషన్ అధికారుల సమాచారం మేరకు శివారు ప్రాంతాల్లో సుమారు 500 కుటుంబాలు వాననీటిలోనే కాపురం చేస్తున్నారు.
అన్నాడీఎంకేను ఏదో రూపంలో విచ్ఛిన్నం చేయాలని డీఎంకే, బీజేపీ, శశికళ, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం కుట్ర పన్నారని, ఇందుకోసం వారంతా శతవిధాలా ప్రయత్నిస్తున్నారని సినీ నటి, అన్నాడీఎంకే మహిళా నేత గాయత్రి రఘురాం(Gayatri Raghuram) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) దీపావళి సమయంలో తీపి కబురు చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించారు.
కోయంబత్తూర్ కేసులో యావజ్జీవఖైదీగా పుళల్ కేంద్ర కారాగారంలో ఉన్న వీరభారతి, తనను ముందుగానే విడుదల చేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్ వేశారు.