Share News

Chief Minister: ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందాం

ABN , Publish Date - Nov 27 , 2024 | 10:44 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ పరిశోధన మండలి హెచ్చరించడంతో ఆరు జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

Chief Minister: ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందాం

- భారీ వర్షాలపై సీఎం సమీక్ష

- అధికారులకు ఆదేశాలు జారీ

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ పరిశోధన మండలి హెచ్చరించడంతో ఆరు జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. చెన్నై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మైలాడుదురై, విల్లుపురం, నాగపట్టినం, తిరువారూరు, తంజావూరు(Nagapattinam, Thiruvarur, Thanjavur), కడలూరు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు.

ఈ వార్తను కూడా చదవండి: Droupadi Murmu : ప్రజలకు మెరుగైన జీవితం మన బాధ్యత


nani1.jpg

వర్షబాధిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, వర్షాలు కురిసిన తర్వాత వరద బాధితులకు అందజేయాల్సిన సహాయక చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఆరు జిల్లాల్లో వర్షబాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వ శాఖలతో కూడిన జోనల్‌ కమిటీలను ఏర్పాటుచేయాలని, వైద్య బృందాలను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు.


ఇప్పటికే తమ జిల్లాల్లో వరద ముందస్తు చర్యలను చేపట్టామని కలెక్టర్లు ముఖ్యమంత్రికి తెలిపారు. అదే విధంగా జాతీయ విపత్తుల సహాయక బృందాలను స్వచ్ఛంద సంస్థల సహకారంతో వరద బాధితులకు సాయమందించేందుకు సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగమంతా సిద్ధంగా వుండాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రి కేకేఎ్‌సఎ్‌సఆర్‌ రామచంద్రన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్‌.మురుగానందం, వైద్య ప్రజారోగ్య శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు, రెవెన్యూ శాఖ కమిషనర్‌ రాజేష్‌ లఖానీ తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి

ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!

ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2024 | 10:44 AM